ETV Bharat / state

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఎస్​ఈసీకి చంద్రబాబు లేఖ

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ... ఎస్​ఈసీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు కొందరు అధికారులు లొంగిపోయారని ఎద్దేవా చేశారు.

CBN
లెక్కింపైనా ఫలితాలు ప్రకటించట్లేదు.. ఎస్​ఈసీకి చంద్రబాబు లేఖ
author img

By

Published : Feb 18, 2021, 8:22 AM IST

ఏపీలో మూడోవిడత ఎన్నికల్లో కొన్ని పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు పూర్తయినా.. అధికారులు ఫలితాలను ప్రకటించడం లేదని ఏపీ ఎస్‌ఈసీకి చంద్రబాబు లేఖలో ఫిర్యాదు చేశారు. వైకాపా ఒత్తిళ్ల కారణంగా కావాలనే ఇలా చేస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఫలితాలు విత్‌ హెల్డ్‌లో పెట్టిన కొన్ని పంచాయతీల వివరాలను ఎస్‌ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. ‘గ్రామ పంచాయతీల ఫలితాలను అక్రమ పద్ధతుల్లో తారుమారు చేయడానికి ప్రయత్నించడం తొలి, మలివిడతతో పాటు ఇప్పుడూ కనిపిస్తోంది’ అని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న వారు, అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

‘రామకుప్పం మండలం పెద్దూరులో రౌడీషీటర్‌ సత్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నందున అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. పెద్దూరులో ఉంటున్న కాణిపాకం దేవస్థానం ఈవో ఎ.వెంకటేశ్‌ వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. కుప్పం పట్టణ సీఐ శ్రీధర్‌ అధికార పార్టీకి మేలు చేకూర్చేందుకు వైకాపాయేతర నాయకులను వేధిస్తున్నారు. వీటన్నింటిపై చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో కోరారు.

కర్నూలు జిల్లాలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కొందరు పోలీసులను ప్రభావితం చేసి ఫలితాలు తారుమారు చేసేందుకు యత్నిస్తున్నారని మరో ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌంటింగ్‌ పూర్తైనా తెదేపా బలపరిచిన అభ్యర్థుల గెలుపును ప్రకటించడం లేదన్నారు. ‘‘డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి, సీఐలు మహేశ్వర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, రామలింగం, కేశవరెడ్డి, ఎస్‌ఐలు ప్రియతమ్‌రెడ్డి, మారుతీ శంకర్‌, సురేష్‌లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, వారిపై పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీచూడండి: కేరళ ఓట్ల వేట- 'మూడుసార్లు పోటీ'పై సీపీఐకి చిక్కులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.