ETV Bharat / state

'ప్లీనరీ ఓ డ్రామా గ్యాలరీ... ఆర్టీసీకి రూ.10 కోట్లు నష్టం' - తిత్లీ తుపాను పరిహారంపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్​ను కలిసిన తెదేపా

TDP On YCP Plenarty: ప్లీనరీ కోసం వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇది వైకాపా ప్లీనరీ కాదని.. ప్రభుత్వ ప్లీనరీ అని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్​ను కలిసిన అచ్చెన్నాయుడు నేతృత్వంలోని తెదేపా బృందం.. తిత్లీ తుపాను నిర్వాసితుల పరిహారంలో తెదేపా సానుభూతిపరులను తొలిగించారని కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లారు.

ycp
ycp
author img

By

Published : Jul 8, 2022, 4:43 PM IST

'ప్లీనరీ ఓ డ్రామా గ్యాలరీ... ఆర్టీసీకి రూ.10 కోట్లు నష్టం'

TDP Atchennaidu on YCP Plenary: ఆంధ్రప్రదేశ్ గుంటూరులో జరిగిన వైకాపా ప్లీనరీ ఓ డ్రామా గ్యాలరీ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్లీనరీ పేరుతో జగన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. 2 రోజుల ప్లీనరీతో ఆర్టీసీకి రూ. 10 కోట్లు నష్టం వాటిల్లిందని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల సభలకు అడ్డంకులు సృష్టించే ప్రభుత్వం.. నేడు వైకాపా ప్లీనరీకి మాత్రం సపోర్టు చేస్తుందని దుయ్యబట్టారు. అధికారపక్షానికి ఒక న్యాయం.. ప్రతిపక్షానికి మరొక న్యాయమా ? అని ప్రశ్నించారు. కేవలం ప్లీనరీ కోసం నాగార్జున యూనివర్శిటీలో జరిగే పరీక్షలను వీసీ వాయిదా వేశారని ఆరోపించారు. స్కూల్ బస్సులు, ప్రైవేట్ వాహనాలను బలవంతంగా లాక్కుంటున్నారు.. డ్వాక్రా మహిళలను బెదిరించి ప్లీనరీకి తరలిస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెదేపా నిర్వహిస్తున్న కార్యక్రమాలు చూసి వైకాపా వెన్నులో భయం పుట్టుకొచ్చిందన్నారు.

TDP Meet Srikakulam Collector: తిత్లీ తుపాను నిర్వాసితుల పరిహారం చెల్లింపులో తెదేపా సానుభూతిపరులను తొలగించారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రైతు సమస్యలపై శ్రీకాకుళం కలెక్టరేట్​లో వినతిపత్రం అందించడానికి వెళ్లిన తెదేపా బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కలిసేందుకు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు అడ్డుకోవడంతో తెదేపా బృందం మండిపడింది. దీంతో కలెక్టరేట్ ప్రాంగణంలో పోలీసులు, తెదేపా శ్రేణుల మధ్యం తోపులాట చోటు చేసుకుంది. అనంతరం జిల్లా సమస్యలపై తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ కలిసి.. కలెక్టర్​కు వినతిపత్రం అందించారు. తిత్లీ పరిహారం పంపిణీలో తెదేపా సానుభూతి పరులను తొలగించారని.. వారిని ఆదుకోవాలని కలెక్టర్​ను కోరారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.