నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పబ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టారు. జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. పబ్‌లలో అనువనువూ జల్లెడ పట్టారు. నగరంలో ఇటీవల మాదకద్రవ్యాలు పట్టుబడడం వల్ల... ముందస్తుగా ఆయా పబ్‌లలో తనిఖీలు చేసినట్టు అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు పబ్‌లు, బార్‌లలో అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఇంట్లోనే గంజాయి పెంపకం... అక్రమంగా వ్యాపారం...