ETV Bharat / state

Tarun Chugh: రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలను అంతం చేస్తాం - హుజురాబాద్‌ ఉప ఎన్నిక

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు తప్పక ఓడిపోతారని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్(Tarun Chugh) జోస్యం చెప్పారు. అవినీతిపరులైన ముఖ్యమంత్రి కుటుంబసభ్యులకు ఓటమి తప్పదన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో(Huzurabad by election) కమలం.. కేసీఆర్ అహంకారాన్ని అణిచి వేస్తుందన్నారు.

Tarun Chugh
తరుణ్ చుగ్
author img

By

Published : Jun 21, 2021, 6:58 PM IST

హుజురాబాద్‌ ఉప ఎన్నిక(Huzurabad by election).. తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరుగా భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్(Tarun Chugh) అభివర్ణించారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుటుంబసభ్యులకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఈటల(Etela) కచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ అహంకారాన్ని అణిచి వేసే రోజులు రానే వచ్చాయన్నారు.

రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలను అంతం చేస్తాం. హుజూరాబాద్​లో కమల వికాసం ఖాయం. కేసీఆర్.. మాయ మాటలతో రైతులను, యువతను మోసం చేశారు. కేంద్రం.. డిసెంబర్ నాటికి దేశంలో 200 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ప్రజలంతా కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

- తరుణ్ చుగ్, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్

'వారసత్వ రాజకీయాలను అంతం చేస్తాం'

ఇదీ చదవండి: KTR: సిరిసిల్లలో కేటీఆర్ ఆకస్మిక పర్యటన... ఎందుకంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.