ETV Bharat / state

'అమెరికాలో భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు' - అమెరికాలో భారతీయుల పరిస్థితి

అమెరికాలో జాతివివక్ష అల్లర్లతో ప్రవాస భారతీయులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తానా ప్రెసిడెండ్ జయశేఖర్ తాళ్లూరి తెలిపారు. ఎన్నారైలు కొంతమేర నష్టం జరిగిందని కానీ ఎలాంటి ప్రమాదం లేదని భరోసా ఇచ్చారు.

'అమెరికాలో భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు'

author img

By

Published : Jun 4, 2020, 12:31 PM IST

ఐ కాంట్ బ్రీత్ నినాదంతో అమెరికాలో జాతి వివక్ష ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రవాస భారతీయులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా -తానా ప్రెసిడెంట్ జయ శేఖర్ తాళ్లూరి అన్నారు.

అమెరికన్ పోలీసుల చేతిలో అసువులు బాసిన జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై ఆయన స్పందించారు. దీన్ని కేవలం కొంతమంది పోలీసుల కర్కశ చర్యగా చూడాలన్నారు. ఐ కాంట్ బ్రీత్ నినాదంతో కొంతమంది దుండగలు కోవిడ్ కారణంగా మూసిఉన్న దుకాణాలను కొల్లగొడుతున్నారని..ఈ లూటీల్లో భారతీయులు కొంతమేర నష్టపోయారన్నారు. అల్లర్లను సద్దుమణిగించేందుకు అమెరికా ప్రభుత్వం సైన్యం సహాయం తీసుకుంటుందన్నారు. ఈ ఆందోళనల కారణంగా భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు.

'అమెరికాలో భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు'

"అమెరికాలో జార్జ్​ ఫ్లాయిడ్​ మృతికి కారణం కేవలం నలుగురు పోలీసులు మాత్రమే. కానీ ఇది జాతి వివక్ష ఉద్యమంగా తీవ్రమవుతోంది. దీనికి అందరూ మద్దతు పలుకుతున్నారు. అయితే ఈ సమయంలో భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు. వారికి ఎలాంటి ప్రమాదం లేదు."

-జయ శేఖర్ తాళ్లూరి, తానా ప్రెసిడెంట్

ఇదీ చూడండి: పంట ధర నిర్ణయం రైతులకే- స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.