ఆత్మనిర్భర్ భారత్ స్వయం ఆధార భారత్ అనే నినాదం అనేక మందిని స్వావలంబనగా ఉండేలా ప్రోత్సహిస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్ట్‌ప్ ఇండియా వంటి అనేక పథకాలతో.. చాలా మంది స్వయం ప్రతిపత్తి కలిగిన పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని తమిళిసై పేర్కొన్నారు. హైదారబాద్ బంజారాహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ఫ్యాషన్ సెలూన్‌ను తమిళిసై ప్రారంభించారు.
దేశంలో 75 వేలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్‌లతో శక్తివంతమైన స్టార్టప్ వ్యవస్థ ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ఎఫ్ సెలూన్ స్టైల్స్ సరికొత్త అంతర్జాతీయ ట్రెండ్‌ను నగరానికి తీసుకొచ్చిందని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.
ఈ సెలూన్ కేవలం మహిళల కోసం మాత్రమే కాకుండా మొత్తం కుటుంబం కోసం ఏర్పాటు చేసిన ఫ్యామిలీ సెలూన్ అని ఎండీ సంగీత రాజేశ్ అన్నారు. పురుషుల కోసం తమ వద్ద 72 రకాల సేవలు ఉన్నాయని చెప్పారు. తమ దగ్గర రసాయన, సింథటిక్ ఉత్పత్తులను ఉపయోగించకుండా.. కేవలం బయో, సహజ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తామని సంగీత రాజేశ్ తెలిపారు.
ఇవీ చదవండి: 'మిషన్ భగీరథ దేశంలోనే మేటి పథకం'