రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను మర్యాదపూర్వకరంగా కలిశారు. చెన్నైలోని స్టాలిన్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. హైదరాబాద్ రాజ్ భవన్లో పండించిన మామిడి ఫలాలను స్టాలిన్‌కు గవర్నర్ అందించారు.
పుదుచ్చేరి విమానాశ్రయ విస్తరణకు 200 ఎకరాల స్థలాన్ని కేటాయించి సహకరించాలని ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై.. స్టాలిన్‌ను కోరారు. పుదుచ్చేరి విమానాశ్రయంతో తమిళనాడు సరిహద్దు జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి టీఆర్ బాలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: KCR ON CORONA: రెండే రెండు గోళీలు వాడిన... కరోనా ఖతమైంది