ETV Bharat / state

రాయపాటికి బెదిరింపుల కేసులో తమిళ నటి పాత్ర

సీబీఐ అధికారులమంటూ ఏపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావును బెదిరించిన కేసులో సూత్రధారులుగా తమిళనటి లీనా మరియా పాల్‌ (మద్రాస్‌ కేఫ్‌ ఫేమ్‌), ఆమె భర్త సుఖేష్‌ చంద్రశేఖర్‌లను సీబీఐ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన మణివర్ధన్‌రెడ్డి, తమిళనాడులోని మధురైకి చెందిన సెల్వ రామరాజ్‌లను అరెస్టు చేశారు. ఈ ముఠా... దేశంలో ఇంకా చాలామందిని ఇలాగే మోసం చేసి ఆర్జించిన డబ్బును విదేశాలకు తరలించి ఉంటారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

samba
రాయపాటికి బెదిరింపుల కేసులో తమిళ నటి పాత్ర
author img

By

Published : Jun 15, 2020, 10:51 AM IST

బ్యాంకులను మోసగించారన్న ఆరోపణలతో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంస్థపై సీబీఐ గత డిసెంబరులో కేసు నమోదు చేసింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న కొంతమంది మోసగాళ్లు... డబ్బు వసూళ్లకు ప్రయత్నించారు.

సీబీఐ పేరుతో బెదిరింపులు

మణివర్ధన్‌రెడ్డి ముఠా ఈ ఏడాది జనవరి 3న తాము సీబీఐ అధికారులమని చెబుతూ రాయపాటి సాంబశివరావుకు ఫోన్‌ చేశారు. డబ్బులిస్తే కేసు నుంచి బయట పడేస్తామన్నారు. జనవరి 4న మణివర్ధన్‌రెడ్డి స్వయంగా గుంటూరు వెళ్లి రాయపాటిని కలిసి.. అడిగినంత ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు.

తీగ లాగితే కదిలిన డొంక

ఈ బెదిరింపులపై రాయపాటి సాంబశివరావు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు... ఫోన్​ చేసిన వ్యక్తుల వివరాలపై ఆరా తీశారు. చివరకు మణివర్ధన్‌రెడ్డి, రామరాజ్‌ను అరెస్టు చేశారు. విచారణ లోతుల్లోకి వెళ్లిన కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులకు మరిన్ని విస్తుగొలిపే వాస్తవాలు తెలిసాయి. ఇందులో తమిళ నటుల పాత్ర ఉన్నట్టు తేలింది.

తమిళ నటి, ఆయన భర్త సూత్రధారులు

తమిళనటి లీనా మరియా పాల్‌, ఆమె భర్త సుఖేష్‌ చంద్రశేఖర్‌ ఈ కథనంతా నడిపించినట్టు గుర్తించారు. ఒక్క రాయపాటి సాంబశివరావే కాకుండా సీబీఐ కేసులు ఉన్న చాలా మందిని వీళ్లు సంప్రదించినట్టు తెలిసింది. కేసుల నుంచి తప్పిస్తామని... లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని బెదిరింపులకు దిగినట్టు సీబీఐ అధికారుల విచారణలో తేలింది.

ఇదీ చూడండి : 'నేనెవరో తెలుసా.. మీ వ్యవసాయశాఖ మంత్రిని...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.