తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కాచిగూడ డివిజన్ పరిధిలో మహిళా దినోత్సవ వేడుకలు ఉత్సహంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీమతి అండాలమ్మ, ఆర్టీసీ కాచిగూడ డివిజన్ ఇంఛార్జ్ కృపాకర్ రెడ్డి హాజరయ్యారు. సంవత్సరంలో ఒక రోజును మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించి గౌరవించడం సంతోషకరమని ఆర్టీసీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ కాచిగూడ డివిజన్ పరిధిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కొందరు మహిళా ఉద్యోగులకు బహుమతులు అందించారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు కొంత వెసులుబాటు కల్పించింది. మహిళా ఉద్యోగులు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే డ్యూటీ ఉండేలా నిబంధనలు తీసుకొచ్చారు. అందుకు మహిళా ఉద్యోగులు అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ డివిజన్ పరిధిలోని కాచిగూడ, బర్కత్పురా, ముషీరాబాద్, దిల్సుఖ్నగర్ డిపోలకు చెందిన మేనేజర్లు, మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి : మారుతీరావు విషం తీసుకుని చనిపోయారా?