మంజూరైన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఏర్పడిన అడ్డంకులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్లోని నాంపల్లి పరిసర ప్రాంత ప్రజలతో చర్చించారు. ప్రభుత్వం ప్రజలకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారికి జులై 10 వరకు సమయం ఇస్తున్నామని స్వచ్ఛందంగా వారు పక్కకు తప్పుకోవాలని సూచించారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు ఇళ్ల నిర్మాణం జరుగుతున్న స్థలం తమదని చెబుతూ తప్పుడు పత్రాలు చూపుతున్నారని... ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా ఆ స్థలానికి సంబంధించి ఎవరకి చెందినట్టుల లేదని స్పష్టం చేశారు. త్వరలో ప్రజలకు రెండు పడక గదుల ఇళ్లు పూర్తి చేస్తామని హామీనిచ్చారు.
ఇదీ చూడండి: 'పట్టుదల ఉంటే... ఏ వయసులోనైనా కలసాకారమవుతుంది'