విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 122వ జయంతిని క్షత్రియ సేవ సమితి హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. ట్యాంక్ బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు సమితి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలడించి దేశమత రక్షణకు ప్రాణం ఇచ్చి పోరాడిన... క్షత్రియ తేజం, విప్లవ వీరుడు అల్లూరి అని మంత్రి తలసాని కొనియాడారు. ఆయన పోరాట స్పూర్తితో క్షత్రియులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ... అందుకు అవసరమైన సహాయ, సహకారాల కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని తలసాని వారికి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : చీటింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్