ETV Bharat / state

talasani srinivas yadav : రేపే క్రైస్తవ సోదరులకు విందు.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి - తెలంగాణ వార్తలు

talasani srinivas yadav :ప్రభుత్వం తరఫున క్రైస్తవ సోదరులకు ఇచ్చే విందు ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈ విందును ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్... క్రైస్తవ సోదరులతో కలిసి రేపు భోజనం చేస్తారని చెప్పారు.

talasani srinivas yadav, dinner to christians
రేపే క్రైస్తవ సోదరులకు విందు
author img

By

Published : Dec 20, 2021, 6:07 PM IST

talasani srinivas yadav : క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేపు విందు ఇవ్వనున్నట్లు... రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్​తో కలిసి పరిశీలించారు. ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వమే నిర్వహిస్తోందని మంత్రి వెల్లడించారు. తెలంగాణవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, గ్రామాల్లోనూ పండుగ కానుకల పంపిణీ జరుగుతోందని చెప్పారు.

కేసీఆర్ విందు

మంగళవారం సాయంత్రం జరగనున్న ఈ విందు కోసం... క్రైస్తవ మత పెద్దలకు ఇప్పటికే ఆహ్వానం అందించామని మంత్రి పేర్కొన్నారు. క్రైస్తవ పెద్దలతో కలిసి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విందు చేస్తారని... మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని చర్చిలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించామన్నారు. ఆ ఏసుక్రీస్తు దయతో కరోనా, ఒమిక్రాన్ పోవాలని కోరుకుంటున్నట్లు మంత్రి అన్నారు. క్రైస్తవ భవన్, శ్మశాన వాటికను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఎమ్మెల్యే దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ ఎమ్ఎస్ ప్రభాకర్, రాజేశ్వరరావు, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రేపే క్రైస్తవ సోదరులకు విందు

ఇదీ చదవండి: Ministers Protest over paddy procurement : మోతెత్తిన చావుడప్పు.. కేంద్రం తీరుపై భగ్గుమన్న మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.