ఇండియన్ స్కూల్ ఆఫ్ జిబినెస్లో యాక్షన్ ఫర్ ఇండియా 8వ వార్షిక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో టీ-హబ్, ఐఐటీ హైదరాబాద్, యాక్షన్ ఫర్ ఇండియా సంస్థలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సామాజిక ప్రయోజనం ఉన్న సాంకేతిక అంకురాలను ప్రోత్సాహించటం, వాటికి అనుకూల వాతావరణం సృష్టించటమే ఈ ఒప్పందాల ప్రధాన లక్ష్యమని జయేష్ పేర్కొన్నారు.
ప్రథమ స్థానంలో ఉంచేందుకే....
ఈ ఒప్పందం ద్వారా... వచ్చే ఐదు సంవత్సరాల్లో 5000 అంకురాలను ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు. అంకురాలకు తగిన వాతావరణం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణను ప్రథమ స్థానంలో ఉంచాలన్న లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. లక్ష్యాన్ని చేరుకోవటం సులభమేనని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: పీఈటీ ఉద్యోగాల ధ్రువపత్రాల పరిశీలనకు 71 మంది ఎంపిక