ఇల్లు.. కుటుంబం... బంధాలు.. బంధుత్వాలు.. తదితర అంశాలపై ప్రత్యేకంగా ముద్రించిన 'గీటురాయి' సంచికను జమాఅతె ఇస్లామీ హింద్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదతుల్లా హుసైనీ ఆవిష్కరించారు. కుటుంబ విలువలను పెంపొందించేలా తెలుగు ప్రజల కోసం ప్రత్యేక సంచికను వెలువరించిన గీటురాయి యాజమాన్యాన్ని హుసైనీ అభినందించారు.
దేశ వ్యాప్తంగా కుటుంబ సంబంధాల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు సర్వే నిర్వహించడం జరిగిందని సయ్యద్ సాదతుల్లా హుసైనీ తెలిపారు. బలహీనమవుతున్న కుటుంబ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు జాతీయ స్థాయిలో 10రోజులు ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. బలమైన కుటుంబ వ్యవస్థతోనే సమాజం బలపడుతుందని అన్నారు. పటిష్ఠ సమాజం ద్వారానే శక్తిమంతమైన దేశాన్ని నిర్మించవచ్చని హుసైనీ తెలిపారు.
కుటుంబ విలువలను చర్చల్లోకి తీసుకువచ్చేలా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పిస్తామని జమా అతె ఇస్లామీ హింద్ తెలంగాణ అధ్యక్షులు హామిద్ ముహమ్మద్ ఖాన్ అన్నారు.
ఇదీ చదవండి: నోరూరించే చికెన్ ఆవకాయ తయారీ ఎలా?