రాష్ట్రంలోని ప్రతి విద్యాసంస్థలో... పాక్‌పై 1971లో భారత్ గెలిచిన తీరును వివరించి.. దేశభక్తిని పెంపొందించాలని గవర్నర్ తమిళిసై సూచించారు. భారత్ - పాక్ మధ్య... 1971 యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో స్వర్ణిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు గవర్నర్ తమిళిసై, హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాక్‌పై భారత సైనికులు సాధించిన ఘన విజయం.. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని గవర్నర్ పేర్కొన్నారు.
అమరుల కుటుంబాలకు రెండు పడకగదుల ఇళ్లు
అమరుల కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్లల్లో రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. వారు ఇళ్లు నిర్మించుకుంటే ఆస్తిపన్ను మినహాయిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంతకు ముందు సైనిక అమరవీరుల స్తూపానికి గవర్నర్, హోంమంత్రి, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీకుమార్ నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి: మేయర్ పీఠాన్ని అధిష్ఠించిన మహిళామణుల గురించి తెలుసా...?