ETV Bharat / state

పట్టణాల్లో వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి

పట్టణ ప్రాంతాలను స్వచ్ఛ పట్టణాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సమగ్ర వ్యర్థాల నిర్వహణతోపాటు ఏళ్ల తరబడి పేరుకుపోయిన వ్యర్థాల శుద్ధిని ప్రారంభించింది. మానవవ్యర్థాల శుద్ధి కోసం ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయటంతోపాటు పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ చర్యలు పూర్తి కావస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు వోడీఎఫ్​ప్లస్ హోదా కోసం ప్రయత్నిస్తోన్న ప్రభుత్వం... స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌లోనూ మంచి ఫలితాలను పొందేందుకు దృష్టి సారించింది.

పట్టణాల్లో వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి
పట్టణాల్లో వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి
author img

By

Published : Oct 7, 2020, 4:50 AM IST

పట్టణాల్లో వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి

పట్టణాల్లో పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త పురచట్టంలో పచ్చదనం, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. పల్లెల తరహాలోనే పట్టణప్రాంతాలకు బడ్జెట్‌లోనే నిధులు కేటాయించి... జనాభా ప్రాతిపదికన ప్రతినెల విడుదల చేస్తోంది. జీహెచ్​ఎంసీ మినహా రాష్ట్రంలోని 140 నగర, పురపాలికల్లో పారిశుద్ధ్య నిర్వహణపై సర్కార్‌ దృష్టి సారించింది. ప్రధానంగా వ్యర్థాల సేకరణ, సమగ్ర నిర్వహణకు పంచసూత్రాలు అమలు చేస్తోంది. ఇళ్లనుంచి చెత్తసేకరణ, సేకరణ సమయంలో చెత్తను వేరు చేయడం, వాణిజ్య వ్యర్థాల నిర్వహణ, డీఆర్​సీసీ కేంద్రాలు, కంపోస్టింగ్ ఇందులో ఉన్నాయి. వాణిజ్యవ్యర్థాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఆటోలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అటు డీఆర్​సీసీ కేంద్రాల నిర్వహణ, కంపోస్ట్ తయారీ కూడా పకడ్బందీగా చేయనున్నారు.

పురపాలికల్లో బయోమైనింగ్

ఏళ్ల తరబడిగా పేరుకుపోయిన వ్యర్థాల నిర్వహణపైనా దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 68 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్‌ను... బయో మైనింగ్ విధానంలో నిర్వహణ చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. 52 పురపాలికల్లో ఉన్న లెగసీ వేస్ట్ నిర్వహణ బాధ్యతను రెండు సంస్థలు దక్కించుకున్నాయి. మిగతా వాటికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. భువనగిరి పురపాలికలో బయోమైనింగ్ ప్రక్రియను మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పురపాలికల్లోనూ ఇదేతరహాలో శుద్ధి చేయనున్నారు. అనంతరం వచ్చే సేంద్రీయ ఎరువును కొనుగోలుకు టీఎస్​ఆగ్రోస్‌తో పురపాలకశాఖ ఒప్పందం చేసుకొంది. ఆలయాలు, ప్రార్థనామందిరాల నుంచి వచ్చే పూలు, సంబంధిత వ్యర్థాల ద్వారా అగర్ బత్తీలు, ఇతర ఉత్పత్తులు తయారు చేసేలా... హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ పురపాలకశాఖతో ఒప్పందం కుదుర్చుకొంది. మానవవ్యర్థాల శుద్ధి కోసం ఇప్పటికే... వరంగల్‌లో ఓ ఫ్లాంటు ప్రారంభంకాగా... 2021 నాటికి 71 చోట్ల ఈ తరహా ప్లాంట్లు ప్రారంభం కానున్నాయి.

వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు

వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... కొత్త పురపాలికలు, విలీన గ్రామాల్లో... మరో 8వేల వ్యక్తిగత శౌచాలయాలను మంజూరు చేసింది. వాటిలో ఐదువేలు పూర్తికాగా... మూడువేలు వివిధ దశల్లో ఉన్నాయి. పట్టణప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి ఒకటి చొప్పున పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలనుకున్న సర్కార్‌.... ఇప్పటికే 4 వేల 794 నిర్మించగా.. మరో 4 వేల 65 మరుగుదొడ్లను ప్రారంభించింది.

ఇదీ చదవండి:దుబ్బాక బరిలో రఘునందన్​ రావు.. ప్రకటించిన పార్టీ అధిష్ఠానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.