గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీదు బండ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో బాలిక మృతదేహం కనిపించింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలిని మహబూబాబాద్ జిల్లా వనపర్తికి చెందిన మొగులయ్య, పద్మ దంపతుల కుమార్తె నాగేశ్వరిగా గుర్తించారు.
నిన్న సాయంత్రం నుంచి తమ కూతురు కనపడడం లేదని నాగేశ్వరి తల్లిదండ్రులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఇక పొక్సో కేసుల దర్యాప్తు మరింత ముమ్మరంగా..