Survey on Marriages: జీవితంలో స్థిరపడే వరకు అబ్బాయిలు, అమ్మాయిలు ఎదురుచూసినా కల్యాణ గడియలు మాత్రం మూడు పదులలోపు మోగాల్సిందే అంటున్నారు. మార్చి 1 జాతీయ వివాహ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌తోపాటు దేశంలోని వేర్వేరు నగరాల్లో వెడ్డింగ్‌వైర్ సంస్థ 635 మంది కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలను సర్వే చేయగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
- కొవిడ్ మహమ్మారి శుభకార్యాలపై తీవ్ర ప్రభావం చూపింది. గడిచిన రెండేళ్లలో చాలా వివాహాలు వాయిదా పడ్డాయి.
- 37 శాతం మంది కొత్త జంటలు తమ పెళ్లి ముహూర్తం/వివాహ విందు వేడుకలను మార్చుకున్నట్లు వెల్లడించారు.
- ఈ సమయంలో వివాహం చేసుకున్న వారి సగటు వయసు 29గా ఉంది. మరింత ఆలస్యం చేస్తే ముప్పై దాటుతుందని కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే పెళ్లిళ్లు చేసుకున్నారు.
- పెళ్లి ఖర్చు కొవిడ్ తర్వాత బాగా పెరిగింది. చాలా వస్తువుల ధరలు పెరగడంతో ఆ ప్రభావం పెళ్లి బడ్జెట్‌పై పడింది.
- కరోనా భయంతో ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో వాట్సాప్‌లోనే 76 శాతం వివాహ ఆహ్వానాలు వెళ్లాయి. ఆ తర్వాత ఫోన్ చేసి పిలిచారు. 12 శాతం మంది వెడ్‌టెక్ ఫ్లామ్‌ఫామ్స్‌ను వినియోగించుకున్నారు.
- వేడుక కుటుంబ సభ్యులు/స్నేహితుల సమక్షంలోనే జరుపుకోవడం ఇష్టమని 90 శాతం కొత్త జంటలు తెలిపాయి. కేవలం 5 శాతం మంది మాత్రమే వర్చువల్ వైపు మొగ్గుచూపారు.
- పెళ్లి అంటే సాధారణంగా విందు భోజనం, అలంకరణపై ఎక్కువ దృష్టి ఉంటుంది. కొవిడ్ భయాలతో అతిథుల సంఖ్యను కుదించి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలోనే ఎక్కువ మంది మంది వివాహాలు చేసుకున్నారు. ఇదే తమకు మొదటి ప్రాధాన్యం అయ్యిందని 82 శాతం మంది చెప్పారు.
ఇదీ చదవండి: