ETV Bharat / state

రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలనేదే నా స్వప్నం: సీఎం రేవంత్​ - Surgical Instruments Group in hyd

Surgical Instruments Group Holdings Investment in Telangana : పెట్టుబడుల వేటే లక్ష్యంగా మూడు రోజులపాటు సాగిన ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటన ముగిసింది. రైతులను ధనికులను చేయడమే లక్ష్యమన్న రేవంత్‌రెడ్డితో ఇప్పటివరకూ సుమారుగా రూ.37వేల కోట్ల పైగా పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. అదానీ గ్రూప్‌ సంస్థలు అత్యధికంగా పెట్టుబడులు పెట్టడానికి మెుగ్గు చూపించాయి. వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు అంగీకరించాయి.

CM Revanth Reddy Davos Tour
Surgical Instruments Group Holdings Investment
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2024, 3:54 PM IST

Updated : Jan 18, 2024, 7:09 PM IST

రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలనేదే నా స్వప్నం సీఎం రేవంత్​

Surgical Instruments Group Holdings Investment in Telangana : పెట్టుబడుల సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి బృందం దావోస్‌ పర్యటన సాగింది. రూ.37వేల కోట్లకు పైగా పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్‌లో యూకేకి చెందిన సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్(Surgical Instruments Group Holdings) రూ.231 కోట్లతో వైద్య పరికరాల తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది. ఈ మేరకు గురువారం దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ఎండీ గౌరి శ్రీధర, డైరెక్టర్‌ అమర్ చర్చల అనంతరం ఒప్పందం కుదిరింది. ఈ సంస్థ మొదటి దశలో సర్జికల్, ఆర్థోపెడిక్, ఆఫ్తమాలిక్ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. రెండో దశలో రొబొటిక్ వైద్య పరికరాలను తయారు చేయనుంది.

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ - దావోస్​ వేదికగా రూ. 37వేల కోట్లకు పైగా పారిశ్రామిక ఒప్పందాలు

CM Revanth Reddy Davos Tour Update : సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పేర్కొన్నారు. అన్నదాతలకు కార్పొరేట్ సంస్థల తరహాలో లాభాలు వస్తే ఆత్మహత్యలు ఉండవన్నారు. రైతులకు కనీస మద్దతు ధరకన్నా ఎక్కువ లాభాలు రావాలన్నది తన స్వప్నమని దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్‌ పేర్కొన్నారు.

"భారత్‌లో రైతు ఆత్మహత్యలు అతిపెద్ద సమస్య. రైతులకు బ్యాంకు రుణాలు రావు, ఆధునిక టెక్నాలజీ లేదు. సరైన లాభాలు రావడం లేదు. తెలంగాణలో మాది రైతు ప్రభుత్వం. రైతుభరోసా ద్వారా నేరుగా పెట్టుబడి సాయం అమలు చేస్తున్నాం. రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలని నా స్వప్నం. లాభాలు వస్తే రైతు ఆత్మహత్యలు 99శాతం ఉండవు."- రేవంత్​ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి

దావోస్​లో 'ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ' క్యాంపెయిన్​ - పెట్టుబడుల వేట షురూ చేసిన సీఎం రేవంత్

CM Revanth Reddy Speech at WEF Meeting : దేశంలో వ్యవసాయం, రైతు ఆత్మహత్యలు అతిపెద్ద సమస్యగా మారాయని రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. రైతులు తమ ఉత్పత్తులను స్వయంగా అమ్ముకోలేరని చెప్పారు. వారికి బ్యాంకు రుణాలు రావని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత వారికి అందుబాటులో లేక లాభాలను సైతం పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలకు కనీస మద్దతు ధర అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం నేరుగా రైతులకే అందించే కార్యక్రమం ప్రారంభించిందని తెలిపారు. కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా రైతులు లాభాలు ఆర్జించాలనేది తన స్వప్నమని అన్నారు.

CM Revath on Farmers Problems : కార్పొరేట్ రంగంలో పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం మాదిరిగా ఈ లాభాలు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సదుపాయాన్ని కల్పిస్తే 99 శాతం రైతు ఆత్మహత్యలు ఉండవని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు ఎల్లప్పుడూ ప్రపంచానికి సాయం చేస్తున్నారని, ప్రపంచం కూడా అన్నదాతలకు అండగా నిలవాలని అన్నారు. దావోస్‌ పర్యటన అనంతరం లండన్‌లో మూడు రోజులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం పర్యటించనున్నారు. పారిశ్రామికవేత్తలతో చర్చించనుంది. థేమ్స్ నది అభివృద్ధి, పర్యాటకంపై అధ్యయనం చేయనుంది.

భారీ పెట్టుబడులే టార్గెట్ - నేటి నుంచి సీఎం రేవంత్ దావోస్ పర్యటన

Last Updated : Jan 18, 2024, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.