రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీ దేవి అన్నారు. హైదరాబాద్లోని కొత్తపేటలో బ్రాహ్మణ పరిషత్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బ్రాహ్మణులు మద్దతు తెలపటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
పట్టభద్రులందరూ ఆలోచించి ఓటు వేయాలని వాణీ దేవి కోరారు. యువత సమస్యలపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని తెలిపారు. పెద్దల సభకు పంపిస్తే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తానని ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: కనుల పండువగా పెద్దగట్టు జాతర