నాటకం అనగానే గుర్తుకువచ్చే పేరు సురభి. ఆడవారి వేషాలు మగవారు వేసే కాలంలో, నాటక రంగానికి మొట్టమొదటి నటిని ఇచ్చిన కళామతల్లి సురభి. నాటక సమాజాలు మన తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఉన్నాయి. అవి ఎంతో మంది కళాకారులను అందించాయి. 135 ఏళ్లుగా కళామతల్లిని ఆరాధిస్తూ... నాటకం అంటే వారి పేరే జ్ఞాపకం వచ్చేలా గుర్తింపు పొందింది. విజయదశమిని పురస్కరించుకొని ప్రత్యేక నాటకాలు ఏర్పాటు చేసినట్లు సురభి కళాకారులు తెలిపారు.
పండుగ రోజు 'ఉదయం పూజ చేసుకొని, మధ్యాహ్నం కుటుంబసమేతంగా పిండివంటలతో భోజనం చేసి, చక్కగా మీ చిన్నారులకు జై పాతాళ భైరవి నాటకం గురించి చెప్పండి... చూపించండి' అని విజ్ఞప్తి చేస్తున్నారు. వారి వెబ్సైట్ను క్లిక్ చేసి సురభి నాటకం చూడవచ్చని సూచించారు.
ఆర్థిక సాయం
కొవిడ్ మహమ్మారి వారి జీవితాలను పూర్తిగా నాశనం చేసింది. సురభి కళాకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో వారిని ఆదుకొని తెలుగు వారందరూ చేయూతనివ్వాలని కోరుతున్నారు. టీఏఆర్ఏ సంస్థ రూ. 50,000 ఆర్థిక సాయం అందించినట్లు సురభి కళాకారులు వెల్లడించారు. ప్రస్తుతం వెబ్సైట్లో ఉచితంగా సురభి నాటకం చూడొచ్చునని పేర్కొన్నారు. వారికి సాయం చేయాలనుకునే వారికోసం బ్యాంక్ వివరాలు వెల్లడించారు.
ఇదీ చదవండి: నాటకాల్లో రాజులు.. జీవితాల్లో బంటులు..