దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు విచారణ చేసింది. పూర్తి నివేదిక ఇవ్వడానికి మరింత సమయం కావాలని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ వేసిన అప్లికేషన్‌పై చర్చించింది. కరోనా నేపథ్యంలో విచారణ ఆలస్యమవుతోందని... ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గడువు కావాలని కమిషన్ కోరారు.
దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు గడువును పెంచేందుకు అనుమతి ఇచ్చింది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి... పూర్తి నివేదిక సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.