ETV Bharat / state

Supreme Court: ఎన్జీటీ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో మరోసారి విచారణ జరిగింది. ఎన్జీటీ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.

supreme court
పోలవరం, సుప్రీం
author img

By

Published : Jul 8, 2021, 4:53 PM IST

సుప్రీంకోర్టు(Supreme Court)లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మరోసారి విచారణ జరిగింది. భద్రాచలం సహా తెలంగాణలో ముంపును నివారించాలని భాజపా నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. తెలంగాణలో ముంపు ప్రభావంపై ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదిక అందించనుంది.

స్టే ఇవ్వాలని వాదన

ఎన్జీటీ తీర్పును ఒడిశా సుప్రీంలో సవాల్​ చేసింది. తమ వాదన వినకుండా ఎన్జీటీ తీర్పు ఇచ్చిందని పిటిషన్​లో పేర్కొంది. సుప్రీంలో కేసు పెండింగ్‌లో ఉండగా ఎన్జీటీ విచారణపై ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్జీటీ తీర్పుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలపై స్టే ఇవ్వొద్దని పొంగులేటి సుధాకర్‌రెడ్డి న్యాయవాది వాదించారు. దీంతో ఒడిశా విజ్ఞప్తిని తిరస్కరించిన జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

పెండింగ్‌ సూట్‌కు జతచేసి విచారణ చేపడతాం

ఒడిశా పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పోలవరంపై పెండింగ్‌ సూట్‌కు జతచేసి విచారణ చేపడతామని తెలిపింది. పోలవరం ప్రాజెక్టును ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం సమీపంలో నిర్మిస్తున్నారు. ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్​గఢ్, ఒడిశాలోని పలు ప్రాంతాలు పోలవరం జలాశయంతో ముంపునకు గురవుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై పలు రాష్ట్రాలు సుప్రీంలో పిటిషన్​ వేశాయి.

ఇదీ చదవండి: INTER: ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గడువు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.