ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ (insider trading ) అంశంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్(petition)ను.. సుప్రీంకోర్టు (supreme court) కొట్టివేసింది. అమరావతిలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం(Transfer of Property Act) అమలవుతోందంటూ ఆ ప్రభుత్వం తరఫు న్యాయవాది నివేదించగా.... ఈ కేసులో ఆ చట్టం వినియోగంలోకి రాదని... ప్రతివాదుల తరఫు న్యాయవాదులు వాదించారు. భూములమ్మిన వారి తరఫున ఎవరో ఫిర్యాదు చేశారని.. ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపులా వాదనలను విన్న సుప్రీంకోర్టు... ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
సుప్రీంలో విచారణ ఇలా
ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంశంపై(insider trading )ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై(pill)... సుప్రీంకోర్టులో(supreme court) విచారణ జరిగింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది దుష్యంత్ దవే(dushyant dave lawyer)... అమరావతిలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం (Transfer of Property Act) అమలవుతోందని ధర్మాసనానికి నివేదించారు. ఈ చట్టం ప్రకారం... కొనుగోలుదారుకు వివరాలు ఇవ్వాలని వాదించారు. మొత్తం వ్యవహారంలో... అనేక లోపాలున్నట్లు తెలుస్తోందని వాదించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు... చాలాసార్లు ఆ విషయాన్ని ధ్రువీకరించాయని నివేదించారు. ప్రస్తుతం ఈ కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉందని ధర్మాసనానికి తెలిపారు. 2014 నుంచి 2019 వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది... 2019లో ప్రభుత్వం మారాకే ఫిర్యాదులు అందాయని నివేదించారు.
విభేదించిన ప్రతివాద న్యాయవాదులు
ఇక ఏపీ ప్రభుత్వ వాదనలతో ప్రతివాద న్యాయవాదులు విభేదించారు. అమరావతిలో (amaravathi) అక్రమాలు జరిగాయని ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని... న్యాయవాది ఖుర్షీద్ (Advocate Khurshid) వాదించారు. ఒక్కరూ విభేదించనప్పుడు... విచారణ జరపాల్సిన అవసరం ఎందుకని ప్రశ్నించారు. ఈ కేసులో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టం వినియోగంలోకి రాదని... ధర్మాసనానికి నివేదించారు. ఇద్దరి వ్యవహారంలో మోసం చేశారా? లేదా అనేవి ఈ చట్ట పరిధిలో ఉండవని వాదించారు. 2014 అక్టోబరు నుంచి రాజధాని ప్రాంతం ఎక్కడో మీడియాలో వచ్చిందని అన్నారు. 14 గ్రామాల్లో 30 వేలఎకరాల్లో రాజధాని వస్తుందని కథనాలు వచ్చాయని నివేదించారు. రాజధానిపై 2014 డిసెంబరు 30న ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని... కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారని వాదించారు. ఈ కేసు న్యాయ, చట్టపర ఫిర్యాదులు నమోదు కాని కేసుగా నిలుస్తుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
అన్నీ పరిశీలించాకే తీర్పు
మరో ప్రతివాది తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది శ్యామ్ దివాన్... రాజధాని భూములపై ఏపీ హైకోర్టు (ap high court) అన్నీ పరిశీలించాకే తీర్పు ఇచ్చిందని వాదించారు. ఆరేళ్ల తర్వాత భూములమ్మిన వారి తరఫున ఎవరో ఫిర్యాదు చేశారని... ధర్మాసనానికి నివేదించారు. స్థానికులెవరూ ఫిర్యాదు చేయలేదని హైకోర్టు ఉత్తర్వుతో తెలుస్తోందని వాదించారు. ఈ కేసులో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం సెక్షన్-55 వర్తించదన్నారు. రాజధాని ఏర్పాటు అంతా బహిరంగంగానే జరిగిందని నివేదించారు. ఇరువైపులా వాదనలను విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం... ఆ రాష్ట్రం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.
ఇదీ చూడండి: పేరుకు ప్రైవేటు స్కూల్.. ఫీజు మాత్రం ఏడాదికి రూ.500!