Supreme court Dismissed Mallaiah Yadav Petition: కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఎన్నికల పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో... తన వివరణ ఇచ్చేందుకు, లిఖిత పూర్వక స్టేట్‌మెంట్ నమోదు చేసేందుకు అవకాశం కల్పించాలన్న ఆయన వినతిని ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. 2020 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకూ ఏం చేశారని సీజేఐ ధర్మాసనం ప్రశ్నించింది.
మల్లయ్య యాదవ్ 2018 ఎన్నికల్లో తప్పుల తడకలతో ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో అందించారని.. హైకోర్టులో కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పద్మావతి రెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని మల్లయ్య యాదవ్‌కు తెలిపింది. విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయకుండా మల్లయ్య యాదవ్ ఆలస్యం చేయడంపై పలుమార్లు న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఈ పిటిషన్‌పై 2019 డిసెంబర్ 30 నుంచి 2020 మార్చి 3 వరకు ఐదు సార్లు విచారణ జరిగింది.
ఈ క్రమంలోనే మల్లయ్య యాదవ్ తరఫున ఎవరూ హాజరుకాక పోవడంతో హైకోర్టు సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. విచారణకు రావడం లేదని, కౌంటర్ దాఖలు చేయడం లేదని.. పద్మావతి రెడ్డి తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో బొల్లం మల్లయ్య యాదవ్ కౌంటర్ దాఖలు అవకాశాన్ని నిరోధిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి 2020 మార్చిలో ఆదేశాలు జారీ చేశారు.
హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై బొల్లం మల్లయ్య యాదవ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన వివరణ ఇచ్చేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం 2020 నుంచి ఏంచేశారని పేర్కొంది. ఇప్పుడు సుప్రీం కోర్టుకు రావడంపై అసహనం వ్యక్తం చేసింది. ఇంతకాలం ఎందుకు ఆగారని.. హైకోర్టులో ఎందుకు సమాధానం చెప్పలేదని ఆయనను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇవీ చదవండి: పెండింగ్ బిల్లులు... గవర్నర్‌పై ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా
పదవులను త్యాగం చేసినందుకు బీఆర్ఎస్ ఇచ్చిన బహుమతి ఈ సస్పెన్షన్: జూపల్లి
'అగ్నిపథ్'పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. వారికి మాత్రం నో ఛాన్స్!
'పెగాసస్ ప్లేస్‌లో కొత్త స్పైవేర్.. వారిపై నిఘా కోసం కేంద్రం ఖర్చు రూ.వెయ్యి కోట్లు!'