జనతా కర్ఫ్యూనకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం హర్షనీయమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. సైబరాబాద్ పరిధిలో కరోనా వైరస్ విస్తరించకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తున్నట్లు చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. ఈ మేరకు ఇప్పటికే ఐటీ కంపెనీల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశామన్నారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిచిపోగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం క్వారంటైన్‌కు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్‌తో మా ఈటీవీ ప్రతినిధి తిరుపాల్ రెడ్డితో ముఖాముఖి.
పేట్ బషీరాబాద్ పోలీసులు భేష్...
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన జాగ్రతలపై సైబరాబాద్ పరిధి పేట్ బషీరాబాద్ పోలీసులు వినూత్న పద్ధతి పాటించారు. మాకూ కుటుంబం ఉందని... కానీ ప్రజల భద్రతే మాకు ముఖ్యమనే ప్లకార్డులతో ఓ వీడియోను రూపొందించారు. పేట్ బషీరాబాద్ పోలీసుల చర్యలను డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.
-
Well said, your are the strength and support of our society. The saviour, fighter, and a good samaritan for every needy. Please keep up ur services. Your passion being at this service line for the society, can surely bring the change. pic.twitter.com/3ATrU7no7j
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) March 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Well said, your are the strength and support of our society. The saviour, fighter, and a good samaritan for every needy. Please keep up ur services. Your passion being at this service line for the society, can surely bring the change. pic.twitter.com/3ATrU7no7j
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) March 22, 2020Well said, your are the strength and support of our society. The saviour, fighter, and a good samaritan for every needy. Please keep up ur services. Your passion being at this service line for the society, can surely bring the change. pic.twitter.com/3ATrU7no7j
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) March 22, 2020