జీహెచ్ఎంసీ(GHMC) ఆరోగ్య శాఖ సంయుక్తంగా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ (super spiders vaccination) వేసి కరోనా నియంత్రణకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి తెలిపారు. హైదరాబాద్ ముషీరాబాద్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు.
రిజిస్ట్రేషన్ పనితీరును వ్యాక్సినేషన్ (vaccination)వేసే గదులను ఆయన గమనించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలకు మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. భౌతిక దూరం ఉండే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ఈ వ్యాక్సినేషన్ (vaccination) ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి: Fact Check: ఉల్లిగడ్డపై నల్లని పొర వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందా..?