ETV Bharat / state

CONGRESS: ''గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటన'ను కప్పిపుచ్చే ప్రయత్నం'

author img

By

Published : Aug 17, 2021, 8:38 PM IST

Updated : Aug 17, 2021, 9:28 PM IST

'గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటన'ను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆరోపించారు. ఆచూకీ దొరకని మహిళ కోసం పోలీసులు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్​ చేశారు.

CONGRESS: ''గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటన'ను కప్పిపుచ్చే ప్రయత్నం'
CONGRESS: ''గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటన'ను కప్పిపుచ్చే ప్రయత్నం'

గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై జరిగిన అత్యాచార ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి నిన్నటి నుంచి తాము పోలీసులపై ఒత్తిడి తెస్తే.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని పేర్కొన్నారు. అయినా ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదని విమర్శించారు. ఆచూకీ దొరకని మహిళ కోసం పోలీసులు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని డిమాండ్​ చేశారు.

ఈ సందర్భంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీకి వినతి పత్రం అందజేసినట్లు సునీతారావు పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​ అని చెబుతున్న డీజీపీ.. మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాల నిరోధానికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. గాంధీ ఆసుపత్రిలో నాలుగు రోజుల పాటు ఈ ఘటన జరిగితే.. సూపరింటెండెంట్​ రాజారావు.. నిద్ర పోతున్నారా అని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూస్తుంటే భయమేస్తోంది. గాంధీ ఆసుపత్రి ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని హోం మంత్రికి వినతి పత్రం ఇచ్చాం. నాలుగు రోజుల పాటు బాధిత మహిళలపై అత్యాచారం జరిగితే.. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్​ రాజారావు నిద్రపోతున్నారా..?- సునీతారావు, మహిళా కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షురాలు

ఇదీ జరిగింది..

గాంధీ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్​గా పనిచేస్తోన్న ఉమా మహేశ్వర్​ అనే వ్యక్తి తనపై, తన సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడని మహబూబ్​నగర్​కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం చిలకలగూడ పోలీస్​స్టేషన్​లో ఆమె ఫిర్యాదు చేసింది.

తన బావ చికిత్స నిమిత్తం ఐదు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రికి వచ్చినట్లు బాధితురాలు తెలిపింది. ల్యాబ్ టెక్నీషియన్​గా పనిచేస్తున్న ఉమా మహేశ్వర్ అనే వ్యక్తి మత్తు మందు ఇచ్చి తమపై అత్యాచారానికి పాల్పడి.. తన సోదరిని అపహరించాడని ఆమె ఆరోపించింది. ఇదే విషయమై మహబూబ్​నగర్​లో కేసు నమోదు కాగా.. విచారణ కోసం చిలకలగూడకు కేసును బదిలీ చేశారు. చిలకలగూడ ఇన్స్​పెక్టర్​ బాధిత మహిళను విచారించారు.

కుమారుని అనుమానంతో వెలుగులోకి...

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో ఈ నెల 5న గాంధీ ఆసుపత్రిలో చేరారు. భార్య, మరదలు ఆయనకు సహాయకులుగా వచ్చారు. కుమారుడు రోజూ ఆసుపత్రికి వచ్చి వెళ్లేవాడు. ఆసుపత్రిలోని రేడియోగ్రాఫర్‌ ఉమా మహేశ్వర్‌ ఆ మహిళలకు దూరపు బంధువుకావడంతో.. వారు అతడితో మాట్లాడేవారు. ఈ నెల 8 నుంచి అక్కాచెల్లెళ్లిద్దరూ కనిపించలేదు. రోగి కుమారుడు వెళ్లి ఉమామహేశ్వర్‌ను అడగ్గా.. విషయం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత కథనం..

Gandhi Hospital Rape: గాంధీలో దారుణం.. అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం..!

Last Updated : Aug 17, 2021, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.