ETV Bharat / state

అది.. పేదవాడి షాపింగ్ మాల్

అక్కడ కాళ్ల జోళ్ల నుంచి కంప్యూటర్ వరకు, గుండు పిన్ను నుంచి కుటుంబ సామాగ్రి మొత్తం దొరుకుతుంది. వేసుకునే బట్టల నుంచి పెంచుకునే కోళ్లు, కుక్కలు, పావురాలు కూడా అక్కడ కొనుక్కోవచ్చు. నిరుపేదలకు సరసమైన ధరలకే అక్కడ క్రయ విక్రయాలు లభిస్తాయి. అదే ఎర్రగడ్డలోని ఆదివారం సంత. గత 15 యేళ్లుగా కొనసాగుతున్న ఈ సంతకు వచ్చే సందర్శకుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది.

అది.. పేదవాడి షాపింగ్ మాల్
author img

By

Published : May 13, 2019, 4:28 AM IST

అది.. పేదవాడి షాపింగ్ మాల్

రాష్ట్ర రాజధానిలో షాపింగ్ మాల్స్​లో క్రయవిక్రయాలు చేయాలంటే భారీగా ఖర్చు చేయాల్సిందే. ఇక మధ్యతరగతి, నిరుపేదలు వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయాలంటే కష్టమే. అందుకే రాష్ట్ర రాజధాని మధ్యలో సరిగ్గా 15యేళ్ల క్రితం ఆదివారం సంత వెలసింది. ఈ సంతలో నిరుపేదలకు అవసరమైన అన్ని కుటుంబ అవసరాలకు సంబంధించిన వస్తులు కొనుగోలు చేయవచ్చు. గృహోపకరణాలు, వంట సామాగ్రి, కత్తులు, కత్తిపీటలు, ప్లాస్టిక్ సామాన్లు, గోడగడియారాలు, వాచ్​లు, కుర్చీలు, టేబుళ్లు, ఫిట్ నెస్​కు సంబంధించిన వస్తులు, సౌందర్య సాధనాలు ఇలా అన్ని వస్తువులు ఒకేచోట దర్శనమిస్తాయి.

చౌక ధరలో ఎలక్ట్రానిక్​ పరికరాలు

ఈరోజుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చవుతుంది. అదే ఆదివారం సంతకు వెళ్తే అత్యంత తక్కువ ధరలో లభిస్తాయి. పిల్లలకు సంబంధించిన సైకిళ్లు, పెద్దవాళ్లు వినియోగించే సైకిళ్లు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. వేసుకునే బట్టలు 50 నుంచి 100రూపాయల లోపే ఇక్కడ దొరుకుతాయి. 2012లో సుమారు 20 మంది వర్తకులు ఎర్రగడ్డలో వ్యాపారం ప్రారంభించామని చెబుతున్నారు. ఇప్పుడు రెండు కిలోమీటర్ల వరకు ఆదివారం సంత విస్తరించింది. ఆదివారం వస్తే చాలు...ఇక్కడ హడావుడి అంతా ఇంతా కాదు..క్రయ విక్రయాలతో ..కొనుగోలు, అమ్మకందారులతో సంత కిటకిటలాడిపోతుంది.

తక్కువ ధరకే పెంపుడు జంతువులు

ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు కూడా ఇక్కడ లభిస్తాయి. మేకలు, గొర్రెలు, కోళ్లు, బాతులు, పావురాలు, పందెం కోళ్లు, పిచ్చుకలు, చిలుకలు, వివిధ రకాల పెంపుడు కుక్కలు, పక్షులను పెంచుకునేందుకు వినియోగించే పంజరాలు కూడా ఇక్కడ చౌక ధరలోనే లభిస్తాయి. మేలు రకమైన పక్షులు, జంతువులు ఇక్కడ దొరుకుతాయని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. .

వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న కొనుగోలుదారులు

యువతకు ఇష్టమైన టీషర్ట్ లు, దుస్తులు, మహిళలకు అత్యంత ఇష్టమైన సౌందర్య సాధనాలు అతి తక్కువ ధరలో లభిస్తాయి. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, వారికిష్టమైన వీడియో గేమ్​లు కూడా లభిస్తాయి. ఇంకా..ద్విచక్ర వాహనాల సెకండ్ హ్యాండ్ విడి భాగాలు, టైర్లు, ట్యూబులు కూడా చౌకగా లభిస్తాయి. ఎర్రగడ్డ చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా.. హైదరాబాద్​లోని చాలా ప్రాంతాల వారు ఇక్కడికి కొనుగోలు చేసేందుకు వస్తుంటారని అమ్మకందారులు చెబుతున్నారు.
ఏదేమైనా తక్కువ ధరలో ఇక్కడ అన్నీ లభిస్తుండడం సంతోషకరమంటున్నారు కొనుగోలుదారులు. ఐతే..అవి నాణ్యమైనవో..మన్నికైనవో పరీక్షించి తీసుకోవాలని వీటిపట్ల అవగాహన ఉన్నవారు చెబుతున్నారు.

ఇవీ చూడండి:అయిన వాళ్లు పొమ్మన్నారు... కానీ వాళ్లు ఆదరించారు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.