ETV Bharat / state

స్నేహితుని హత్యకు దారి తీసిన..ప్రియురాలి ప్రస్తావన - latest news of sultan bazaar murder case mystery

సుల్తాన్​ బజార్​ హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రేయసి​ ప్రస్తావనతో.. మృతుని స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పేర్కొన్నారు.

గర్లఫ్రెండ్​ ప్రస్తావనతోనే.. స్నేహితుని హత్య
author img

By

Published : Nov 24, 2019, 9:27 AM IST

Updated : Nov 24, 2019, 11:09 AM IST

హైదరాబాద్​ సుల్తాన్​ బజార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ నెల 22న సాయికుమార్​ అనే యువకుని హత్యను పోలీసులు చేధించారు. కడప నుంచి అతనితో పాటు వచ్చిన తన స్నేహితులైన నరసింహా చారి(మైనర్​), రియాజ్​ అహ్మద్​, శివకుమార్​లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వెల్లడించారు.

ప్రేయసి​ ప్రస్తావన వల్లే:

మూసాపేటలో ఉంటున్న రియాజ్​ అహ్మద్​ సోదరికి డబ్బు ఇవ్వడానికి 21న కడప నుంచి హైదరాబాద్​ వచ్చిన నలుగురు స్నేహితులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. డబ్బు ఇచ్చిన అంతరం నగరంలో పలు ప్రాంతాలను సందర్శించి సుల్తాన్​ బజార్​లోని ఓ లాడ్జిలో సేదతీరారు. మద్యం సేవిస్తూ మాట్లాడుకుంటూ... ప్రస్తావనలో భాగంగా సాయికుమార్​ ప్రేయసి​తో నరసింహాచారి చెడుగా ప్రవర్తించిన విషయాన్ని అహ్మద్​ గుర్తుచేశాడని.. దీనితో కోపోద్రిక్తుడైన సాయి కుమార్​ లాడ్జ్​లోని కిటికీ అద్దాన్ని పగులగొట్టి.. కర్టన్​ రాడ్​తో చారిపై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. సాయిని అదుపుచేయడానికి మిగిలిన ఇద్దరు స్నేహితులు ప్రతయత్నిస్తున్న తరుణంలో నరహింహా చారి.. పగిలిన కిటికీ అద్దాన్ని తీసుకుని సాయికుమార్​ని పొడిచాడు. తీవ్ర రక్త స్రావంతో సాయి అక్కడకక్కడే మృతి చెందినట్లు పోలీసుల పేర్కొన్నారు.
పరారీలో ఉన్న అహ్మద్​ను, నరసింహాచారి, శివకుమార్ శనివారం పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించినట్టు సుల్తాన్​బజార్​ సీఐ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా చిన్న చౌక్​ పోలీస్​స్టేషన్​లో వీరిపై గతంలో అనేక కేసులు ఉన్నట్టు తెలిపారు.

గర్లఫ్రెండ్​ ప్రస్తావనతోనే.. స్నేహితుని హత్య

ఇదీ చూడండి: సుల్తాన్​ బజార్​లో దారుణ హత్య

sample description
Last Updated : Nov 24, 2019, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.