హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో దారుణం చోటు చేసుకుంది. తాగుడుకు బానిసైన ఓ 40 ఏళ్ల వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హమత్నగర్ డివిజన్లోని కార్మిక నగర్‌కు చెందిన మహేందర్ వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. మద్యానికి బానిసైన మహేందర్‌ను 4 నెలల క్రితం భార్య వదిలి వెళ్లిపోయింది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహేందర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తల్లి పెంటమ్మ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: ప్రేమతో డబ్బులు తీసుకుంటుంది... ఇవ్వకపోతే కేసు పెడుతుంది