ETV Bharat / state

'ఆత్మహత్యల నివారణకు కలిసి పోరాడుదాం' - ఆత్మహత్యల నివారణ వార్తలు

సమస్యలున్నాయని ఒకరు..! జీవించటమే సమస్య అని మరొకరు..! జీవితంతో పోరాడలేక ఇంకొకరు..! ఇలా ప్రపంచంలో ఏదో మూల బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. చిన్న కష్టానికే కన్నీరైపోయి జీవితానికి ముగింపు పలుకుతున్నారు. ఒత్తిడి, కుంగుబాటు, భయం, అనుకున్నది సాధించలేకపోవటం..! కారణమేదైనా ఆత్మహత్యే అంతిమ పరిష్కారమని భావిస్తున్నారు. క్రమంగా ఇది అంతర్జాతీయ సమస్యగా మారింది. అందుకే.. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా మరో రెండు సంస్థలు ఈ అంశంపై దృష్టి సారించాయి. ఏటా సెప్టెంబర్‌ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించాయి. బలవన్మరణాలను నిలువరించటమే లక్ష్యంగా ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నాయి.

'ఆత్మహత్యల నివారణకు కలిసి పోరాడుదాం'
'ఆత్మహత్యల నివారణకు కలిసి పోరాడుదాం'
author img

By

Published : Sep 11, 2020, 5:16 AM IST

'ఆత్మహత్యల నివారణకు కలిసి పోరాడుదాం'

ఆత్మహత్య..! పత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఈ వార్తే. బలవన్మరణాల వార్తలు కనిపించని రోజంటూ ఉండటం లేదు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని... ప్రేమలో విఫలమయ్యామని... మానసిక సమస్యలు వెంటాడుతున్నాయని.. కుటుంబ కలహాలతో పడలేకపోతున్నామని... ఇలా రకరకాల కారణాలతో జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు.

బతకటానికి దారి లేదనే అభద్రతాభావమే చాలా మంది ప్రాణాలు బలిగొంటోంది. అసలు ఈ స్థాయిలో ఆత్మహత్యలు పెరిగిపోవటానికి కారణలేంటి..? దేశాలన్నింటినీ పట్టిపీడిస్తున్న ఈ మానసిక సమస్యను అధిగమించటం ఎలా..? ఈ అంశాలపైనే ఎన్నో ఏళ్లుగా మేధోమథనం జరుపుతోంది..అంతర్జాతీయ ఆత్మహత్య నివారణ సంస్థ-ఐఏఎస్పీ. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య-డబ్ల్యూఎఫ్​ఎంహెచ్​ ఈ విషయమై కృషి చేస్తున్నాయి. 2003 నుంచి ఏటా సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం నిర్వహిస్తూ వస్తున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ఏటా 8 లక్షల మంది ఆత్యహత్యలకు పాల్పడుతున్నారు. 40 సెకన్లకు ఒక బలవన్మరణం నమోదవుతోంది. ఆత్మహత్య చేసుకునేవారిలో 15-29 సంవత్సరాలలోపు వారే అత్యధికంగా ఉన్నారు. 60ఏళ్లు దాటినవారూ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఉదంతాలూ వెలుగుచూస్తున్నాయి. దేశంలో నమోదవుతున్న మరణాల్లో... ఆత్మహత్యలది రెండోస్థానం. ఈ సమస్య పరిష్కారానికి ఐఏఎస్పీ సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆత్మహత్యల నివారణకు ప్రజల్లో చైతన్యం కలిగించేలా అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయ సహకారాలు అందిస్తోంది. "ఆత్మహత్యల నివారణకు కలిసి పోరాడుదాం" అన్న నినాదంతో సుమారు 70 దేశాల్లో 300కు పైగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2013లో డబ్ల్యూహెచ్‌వో అసెంబ్లీలో ఒక తీర్మానం చేసింది. బలవన్మరణాలను తగ్గించుకునేందుకు ప్రతి దేశం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించుకోవాలనేది ఆ తీర్మాన సారాంశం. అందుకు చాలా దేశాలు సానుకూలంగా స్పందించాయి. పోలీసులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు, మానసిక నిపుణులను అందులో భాగస్వాములను చేస్తూ ఆ దిశగా ఎంతో కొంత కృషి చేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో, వైద్యశాలల్లో, కార్యాలయాల్లో మానసిక నిపుణులను, కౌన్సెలర్లను నియమిస్తూ ప్రజల్లో మానసిక స్థైర్యం నింపేందుకు, నిరాశ నిస్పృహలను పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారిలో ఆత్మహత్య చేసుకోవాలనే భావనలను దూరం చేయడంపై దృష్టి సారించాయి.

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ఆత్మహత్యల్లో 75.5 శాతం కేవలం తక్కువ, మధ్య స్థాయి ఆదాయాలున్న దేశాల్లోనివే. అందులోనూ 39 శాతం ఆత్మహత్యలు దక్షిణాసియా దేశాల్లోనే నమోదవుతున్నాయి. ఈ ఆత్మహత్యలకు ఆధునిక జీవితం, ఆదాయాల్లో అసమానతలు, రాబడి, ఖర్చులను సమతూకం చేసుకునే సామర్థ్యం లోపించడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇక భారత్‌లో 2015 నుంచి బలవన్మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2019లో మొత్తం లక్షా 39 వేల 123 ఆత్మహత్యలు నమోదు కాగా... 2018తో పోల్చితే... ఇది 3.4% అధికం. 2018తో పోల్చి చూస్తే.. 2019లో ఆత్మహత్యల రేటు 0.2% పెరిగింది.

2019లో అత్యధికంగా మహారాష్ట్రలో 18 వేల 916 బలవన్మరణాలు నమోదయ్యాయి. తరువాత స్థానంలో తమిళనాడు, పశ్చిమబంగ, మధ్యప్రదేశ్, కర్ణాటక ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనే మొత్తం 49.5% బలవన్మరణాలు నమోదవటం ఆందోళన కలిగించే విషయం. ప్రతి లక్ష మందిలో దాదాపు 16 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 15-29 ఏళ్ల వయసున్న వారు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనల్లో.. 38% కేసుల్లో వారి కుటుంబ సభ్యులు సైతం ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి ఆత్మహత్య సగటున 135 మందిని బాధిస్తోంది. వారిలో 25 మందిని ఆత్మహత్య ఆలోచనలకు ప్రేరేపిస్తోంది. వారూ ఆత్మహత్యాయత్నం చేసేలా ప్రతికూల ప్రభావం చూపుతోంది.

ప్రస్తుతం కరోనా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో.. చాలా మంది ఆ భయానికే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అందుకే.. ఈ ఏడాది ఆత్మహత్య నివారణ దినోత్సవానికి ప్రాధాన్యత మరింత పెరిగింది. మానసిక ఆరోగ్య విభాగం, మ్యాక్స్‌ హెల్త్‌కేర్ సంయుక్తంగా నిర్వహించిన ఆన్‌లైన్ అధ్యయనంలో కొన్ని విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో మొత్తం వెయ్యి 69 మంది నుంచి సమాచారం సేకరించగా... వారిలో 25% మంది ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నారని తేలింది. మరో 10% మంది తమను తాము గాయ పరుచుకోవాలని చనిపోవాలని భావిస్తున్నట్టు వెల్లడైంది. కరోనా బాధితులు తమ నుంచి కుటుంబ సభ్యులకూ సోకుతుందన్న భయంతో ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నట్టు స్పష్టమైంది.

ఈ గణాంకాలు ఆందోళన కలిగించేలా ఉన్నా, ఈ విషయంపై పెద్దగా చర్చ జరగడం లేదన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన. ఒకరు ఆత్మహత్య చేసుకుంటే, ఆ ప్రభావం వారి పిల్లలు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు, స్నేహితులు, సహచరులపై పడుతోంది. ఎంతో మంది పిల్లలు అనాథలవుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇలా అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న వారిలో విద్యావంతుల నుంచి చిన్నారుల వరకు ఉంటున్నారు. ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో ఈ సమస్యపై దృష్టి సారించకపోవటం... పరిష్కార మార్గాలు అన్వేషించకపోవటం పరిస్థితులను ఇక్కడి వరకూ తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానసిక నిపుణుల మాటా ఇదే. ఏదో ఏటా నామమాత్రంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవం నిర్వహించి.. తరువాత నిర్లక్ష్యం వహిస్తున్నారన్న వాదనా వినిపిస్తోంది.

ఆత్మహత్యలను నివారించటమే ప్రపంచ దేశాల ముందున్న అతి పెద్ద సవాలు. ఇందుకోసం ఆయా దేశాలు ప్రణాళికలు రచిస్తున్నా.. అవన్నీ కార్యాచరణకు నోచుకోవటం లేదు. అందుకే ఈ సమస్య అపరిష్కృతంగానే ఉంటోంది. భారత్‌లోనూ ఇదే పరిస్థితి. అందుకే.. ఏటా ఈ బలవన్మరణాల సంఖ్య పెరుగుతూ పోతోంది. అసలు ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలూ నిర్వహించకపోవటం సమస్య తీవ్రతను పెంచుతోంది.

ఇదీ చదవండి: 'కష్టాలను అధిగమించకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.