ETV Bharat / state

వానా వానా వల్లప్ప .. రోగం వచ్చేనోయప్ప్

తొలకరి పలకరింపుతో మనస్సు పులకించిపోతుంది కదూ .! హాయినిచ్చే చల్లటి గాలి , చినుకులు చూస్తే గంతులేయాలనిపిస్తుంది... అదే వర్షం మనకు రోగాలు తీసుకొస్తే .. ?వర్షాలు ప్రారంభం కావడంతో పట్టణాలు, పల్లెల్లో అపరిశుభ్రత నెలకొని  ప్రజలు అనారోగ్యం పాలయ్యే పరిస్థితులు పొంచి ఉన్నాయి.

author img

By

Published : Jun 27, 2019, 5:30 PM IST

వానా వానా వల్లప్ప .. రోగం వచ్చేనోయ్ అప్ప ..

తొలకరి పలకరించడంతో ఉభయ జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. వర్షాలు ప్రారంభం కావడంతో పట్టణాలు, పల్లెల్లో అపరిశుభ్రత నెలకొని ప్రజలు అనారోగ్యం పాలయ్యే పరిస్థితులు పొంచి ఉన్నాయి. ఆరోగ్యపరంగా అప్రమత్తం కావాల్సిన సమయం కూడా ఇదే. పారిశుద్ధ్యం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడపడితే అక్కడ మురుగునీరు నిల్వ ఉన్నా, పారిశుద్ధ్యం లోపించినా దోమలు ప్రబలి వ్యాధులకు కారణమవుతాయి. నీరు కలుషితమై అంటువ్యాధులు ప్రబలే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే కొందరు జ్వరాలతో బాధపడుతున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తం కాకుంటే జ్వరాలు, అతిసారం, డెంగీ, కామెర్లు వంటి వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వ్యాధుల కేసులు ఇలా..: వర్షాకాలంలో ముఖ్యంగా జిల్లాలో అధికంగా వచ్చే వ్యాధుల్లో సాధారణ జ్వరాలు, అతిసారం, టైఫాయిడ్‌, మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఏటా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. అధికారుల లెక్కలో మాత్రం ఒకటి, రెండు కేసులే నమోదవుతున్నాయి. 2014 నుంచి 2018 వరకు జిల్లాలో నమోదైన ఆయా రకాల వ్యాధుల వివరాలిలా ఉన్నాయి..

కారణాలు ఇవి..

విషజ్వరం..: కలుషిత నీరు తాగడం, బహిరంగ మల విసర్జన వల్ల వ్యాపించే బాక్టీరియా కారణంగా విషజ్వరం వస్తుంది. జ్వరం త్వరగా తగ్గకపోవడం, ఒంటి నొప్పులు, తలనొప్పి ఈ వ్యాధి లక్షణాలు. కడుపులో అల్సర్ల వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.

చలిజ్వరం.. దోమ వల్ల వచ్చే ఈ జ్వరంలో రెండు రకాలుంటాయి. ఒకటి వైవాక్స్‌ రకం, రెండోది ఫాల్స్‌ఫారమ్‌. వైవాక్స్‌ అంత ప్రమాదకరం కాకపోయినా ఫాల్స్‌పారమ్‌ మాత్రం ప్రాణాంతకమైనది. సకాలంలో చికిత్స చేయించుకోకపోతే సెలిబ్రల్‌ మలేరియాగా మారి రోగి ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. తీవ్రమైన చలిజ్వరం, రోజు విడిచి రోజు రావడం, తలనొప్పి ఈ వ్యాధి లక్షణాలు. ఇవి కనిపిస్తే వెంటనే రక్త పరీక్షలు చేయించుకొని వైద్యుని వద్దకు వెళ్లాలి.
అతిసారం.. ప్రమాదకరం..: కలుషిత నీరు తాగడం, కలుషిత ఆహారం తినడం వల్ల అతిసారం వస్తుంది. ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. రోటా వైరస్‌, అమిమిక్‌ బ్యాక్టీరియా వల్ల వ్యాధి ప్రబలుతుంది. విరేచనాలు, వాంతులు కావడం, నీరసంగా ఉండటం వ్యాధి లక్షణాలు. ఫ్లూయిడ్‌ ద్వారా చికిత్స అందిస్తారు.

డెంగీ.. క్యూలెక్స్‌ దోమ కాటు వల్ల డెంగీ వ్యాధి వస్తుంది. సకాలంలో చికిత్స చేయించుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. జ్వరంతోపాటు మోకాళ్లు నొప్పులు ఉంటాయి. రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఒక్కోసారి కోమాలోకి వెళ్లి ప్రమాదముంది.

ప్రాణాంతకం.. కామెర్లు..: కలుషిత నీరు వల్ల కామెర్ల వ్యాధి వస్తుంది. మద్యం ఎక్కువ తాగినా ప్రబలుతుంది. మూత్రం పసుపు రంగులో రావడం, పొట్టలో నొప్పిగా ఉండటం, వాంతులు, విరేచనాలు కావడంê పాటు జ్వరం రావడం ఈ వ్యాధి లక్షణాలు.

వర్షాకాలంలో వ్యాధులు వేగంగా ప్రబలే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడపడితే అక్కడ నీరు తాగకూడదు. తాజా ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో మసాలాలు తగ్గించాలి. జ్వరం రెండు, మూడు రోజులకు మించి తగ్గకపోతే తక్షణమే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. దోమతెరలు వాడటం మంచిది.

ఇవి చూడండి.. 'ఆసనంతో మీ జీవితం అద్భుతం'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.