మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా తార్నక హెచ్ఎండీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంబీసీ ఛైర్మెన్ తాడూరి శ్రీనివాస్‌తో పాటు పలువురు తెరాస నేతలు పాల్గొన్నారు.
దుర్గంద భరితంగా ఉన్న మూసీని సుందరంగా తీర్చిద్దిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని సుధీర్ రెడ్డి వెల్లడించారు. సీఎం ఆశయ సాధన కోసం నది ప్రక్షాళన చేపట్టి, ప్రతి ఒక్కరూ మూసీ ఒడ్డున సేద తీరేవిధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. భవిష్యత్తులో పర్యాటక ప్రదేశంగాా మారుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి: ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు