ETV Bharat / state

మే 31 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తే రాయితీ

author img

By

Published : May 27, 2020, 10:59 PM IST

జీహెచ్ఎంసీ పరిధిలోని నివాస‌, వాణిజ్య ఆస్తుల‌కు సంబంధించిన ఆస్తి పన్నును ఈనెల 31వ తేదీలోగా చెల్లించి.. ఐదు శాతం ఎర్లీబ‌ర్డ్ రాయితీ పొందాల‌ని బల్దియా క‌మిష‌న‌ర్ లోకేశ్​ కుమార్ విజ్ఞప్తి చేశారు.

GHMC Latest News
GHMC Latest News

గ్రేటర్ హైదరాబాద్​లోని నివాస‌, వాణిజ్య ఆస్తుల‌కు సంబంధించిన 2020-2021 ఆర్థిక ఏడాది ఆస్తి పన్నును ఈనెల 31వ తేదీలోగా చెల్లించి.. ఐదు శాతం ఎర్లీబ‌ర్డ్ రాయితీ పొందాల‌ని జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్​ కుమార్ విజ్ఞప్తి చేశారు. 8.24 లక్షల ఆస్తిప‌న్ను బ‌కాయిదారుల‌కు ఎర్లీబ‌ర్డ్ రాయితీ మెస్సేజ్‌లు పంపించామన్నారు.

ఎర్లీబర్డ్ పథకంలో ఆస్తి పన్నును సిటిజన్ సర్వీస్ సెంటర్లు, ఆన్‌లైన్‌, మీ-సేవా కేంద్రాలు, పౌరసేవా కేంద్రాల్లో చెల్లించాలని కోరారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని సర్వీస్ సెంటర్​కు నగర వాసులు భారీ సంఖ్యలో వచ్చి పన్నులు చెల్లించారు. నగ‌రంలోని య‌శోద కార్పొరేట్ ఆసుపత్రులకు సంబంధించిన ఆస్తిపన్ను రూ. 2.67 కోట్ల రూపాయలు చెల్లించి... 5 శాతం ఎర్లీబ‌ర్డ్ కింద రూ. 14.29 లక్షలు రాయితీ పొందారు.

గతంలో కేవలం రూ.30 వేల వరకే ఆస్తి పన్ను చెల్లించిన వారికే ఎర్లీబర్డ్​ రాయితీ వర్తించేది. కానీ ఇప్పుడు ఎంతవరకు ఆస్తి పన్ను ఉన్నా... ఈనెల 31వ తేదీ లోపు చెల్లిస్తే రాయితీ వర్తిస్తుందని కమిషనర్ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.