ETV Bharat / state

TAC Report on Srisailam project : శ్రీశైలం ప్రాజెక్టుపై తెలంగాణకు టీఏసీ నివేదిక

TAC Report on Srisailam project : శ్రీశైలం ప్రాజెక్టు రూల్‌కర్వ్స్‌ రూపకల్పనకు అనుసరించిన విధానాలను తెలియజేయాలంటూ తెలంగాణ పలుమార్లు కోరిన నేపథ్యంలో టీఏసీ నివేదికను కేంద్ర జలసంఘం రాష్ట్రానికి అందజేసింది. గతంలోనూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కేటాయింపులు ఏ ఒప్పందాలు, ప్రమాణాల మేరకు నిర్వహిస్తున్నారో ఆధారాలు అందజేయాలని తెలంగాణ కోరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీకి, తెలంగాణకు పలు ఔట్‌లెట్ల ద్వారా కేటాయింపులు, జల విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్వహణ వివరాలను ఇందులో పేర్కొన్నారు.

TAC Report on Srisailam project
శ్రీశైలం ప్రాజెక్టు
author img

By

Published : Sep 6, 2022, 9:02 AM IST

TAC Report on Srisailam project : శ్రీశైలం ప్రాజెక్టు రూల్‌కర్వ్స్‌ రూపకల్పనకు అనుసరించిన విధానాలను తెలియజేయాలంటూ తెలంగాణ పలుమార్లు కోరిన నేపథ్యంలో తాజాగా సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ)-58వ సమావేశం నివేదికను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అందజేసింది. కానీ తెలంగాణ నీటిపారుదలశాఖ తాము కోరుతున్న సమాచారం అది కాదని కృష్ణా బోర్డుకు నివేదించినట్లు సమాచారం. జలాశయాల నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల రూల్‌కర్వ్స్‌ను మరోమారు రూపొందిస్తూ (రివైజ్డ్‌) డ్రాఫ్ట్‌ నివేదికను తయారు చేసిన విషయం తెలిసిందే.

దీనిలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీకి, తెలంగాణకు పలు ఔట్‌లెట్ల ద్వారా కేటాయింపులు, జల విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్వహణ వివరాలను పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రివైజ్డ్‌ రూల్‌కర్వ్స్‌ రూపకల్పనకు ఏ ప్రమాణాలను అనుసరించారని, ప్రామాణికతలు ఏంటో తెలియజేయాలంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ పలు లేఖలు రాశారు. గతంలోనూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కేటాయింపులు ఏ ఒప్పందాలు, ప్రమాణాల మేరకు నిర్వహిస్తున్నారో ఆధారాలు అందజేయాలని తెలంగాణ కోరింది.

ఆర్‌ఎంసీ సమావేశంతో ఫలితం ఉండదని తాజా లే.. శ్రీశైలం ప్రాజెక్టు పరిధికి సంబంధించి అంతర్రాష్ట్ర ఒప్పందాలు, కేడబ్ల్యూడీటీ-1 అవార్డు తదితర ఒప్పందాల్లో స్పష్టం చేస్తున్న రూల్‌కర్వ్స్‌ను ఆర్‌ఎంసీ ముసాయిదా నివేదికలో పొందుపర్చాలని తెలియజేస్తూ తాజాగా తెలంగాణ బోర్డుకు లేఖ రాసింది. దీంతోపాటు తమ వద్ద రూల్‌కర్వ్స్‌కు సంబంధించిన కొంత సమాచారం లేదని, బోర్డు వద్ద ఉంటే అందజేయాలని సూచించింది. రూల్‌కర్వ్స్‌పై ఇప్పటికే తెలంగాణ పలు అభ్యంతరాలను లేవనెత్తుతుండగా.. వాటిని నివృత్తి చేయకుండానే ముసాయిదా నివేదిక ఆమోదానికి ఆర్‌ఎంసీ సమావేశం నిర్వహిస్తే ఫలితం ఉండదని పేర్కొంది.

దీంతో స్పందించిన సీడబ్ల్యూసీ తన వద్ద ఉన్న టీఏసీ-58వ సమావేశం నివేదికను తెలంగాణకు పంపినట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన ఆర్‌ఎంసీ కీలక సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.