ETV Bharat / state

Registrations: పూర్తిస్థాయిలో పనిచేయనున్న సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయాలు

రేపటి నుంచి సబ్​ రిజిస్ట్రార్ కార్యాలయాలు​ పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.

sub registrar offices will work on normal timings from tomorrow onwards
పూర్తిస్థాయిలో పనిచేయనున్న సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయాలు
author img

By

Published : Jun 9, 2021, 7:28 PM IST

రాష్ట్రంలో రేపటి నుంచి సాధారణ సమయాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు పని చేస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెల్లడించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సడలింపుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని పరిపాలన డీఐజీ సుభాషిణి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ ద్వారానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని సుభాషిణి వెల్లడించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలు కొనసాగించాలని ఉన్నతాధికారులు సబ్‌ రిజిస్ట్రార్లను ఆదేశించారు.

ఇదీ చదవండి: Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.