సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణ అంశంపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది. ప్రస్తుత భవనాల్లో సౌకర్యాలు, స్థితిగతులపై అధ్యయనానికి నలుగురు ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేశారు. ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇంజినీర్లు రవీందర్రావు, మురళీధర్, సత్యనారాయణరెడ్డి కమిటీ సభ్యులుగా ఉంటారు. సచివాలయం, అసెంబ్లీ భవనాలకు మరమ్మతులు చేయాలా... నూతన భవంతులు నిర్మించాలా... అనేది పరిశీలించి వీరు నివేదిక ఇవ్వనున్నారు.
ఇదీ చూడండి : కర్'నాటకం'లో కొనసాగుతున్న రాజీనామాల పర్వం