ETV Bharat / state

ఖమ్మం కలికితు’రాయి’.. త్యాగానికి నిలువెత్తు నిదర్శనం - అమరవీరుల స్థూపం

కొన్ని శిలలు కొండలుగా మిగిలిపోతాయి. మరికొన్ని మహా సౌధాలవుతాయి. ఇంకొన్ని శిలలు గుడిలో దేవతామూర్తులై పూజలందుకుంటాయి. కానీ.. ఈ శిల అలా కాదు. త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. అమరవీరుల త్యాగానికి ప్రతీక.

Stupa of Martyrs is Made byy Khammama Black Stone
ఖమ్మం కలికితు’రాయి’
author img

By

Published : Jun 28, 2020, 1:59 PM IST

ఖమ్మం జిల్లా నుంచి సేకరించి తరలించిన బ్లాక్​ గ్రానైట్​ ఏకశిల దేశ రాజధాని దిల్లీలో పోలీసు అమర వీరుల స్మారక స్థూపంగా రూపుదిద్దుకుంది. ప్రధాన మంత్రితో సహా.. మహామహులందరి ముందు అమరవీరుల త్యాగాలకు చిహ్నంగా మారి.. నివాళులందుకుంటోంది. 2018లో జాతీయ పోలీసు అమరవీరుల స్థూపం నిర్మించాలని నిర్ణయించినప్పుడు అందుకు అనువైన శిల్పం కోసం దేశవ్యాప్తంగా వెతికారు.

చివరికి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెర్వు మాదారం గ్రామంలోని బ్లాక్​ గ్రానైట్​ క్వారీలో నాణ్యమైన రాయి వారి దృష్టిని ఆకర్షించింది. భూమి ఉపరితలానికి 150 అడుగుల లోతు నుంచి ఈ రాయి తీశారు. చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఈ రాయిని అతి జాగ్రత్తగా దిల్లీకి తరలించి నేషనల్​ గ్యాలరీ ఆఫ్​ మోడ్రన్​ ఆర్ట్స్​ డైరెక్టర్​ జనరల్​ ఘడ నాయక్​ పర్యవేక్షణలో శిల్పులతో స్మారక స్థూపంగా మలిచి ప్రతిష్ఠించారు.

ఇవీచూడండి: నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.