ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పూర్వ విద్యార్థుల అపురూప కలయికకు ఈసారి హైదరాబాద్ వేదికైంది. నాటి గురువులను సత్కరించుకోవడం, భవిష్యత్ తరాలకు ఉజ్వల జీవితాలను అందించాలని బందరు పూర్వ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. అలా ప్రతి ఏటా జనవరి 26న కలుసుకుని వారి అనుభూతులను పంచుకుంటున్నారు.
మచిలీపట్నంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి బహుమతులు అందజేశారు. బందరులో చదివిన వారంతా ఎక్కడున్నా ప్రతి ఏడాది జనవరి 26న కలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి : రామోజీ ఫిలింసిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు