ETV Bharat / state

Students Attendance in Schools: పాఠశాలల్లో క్రమంగా పెరుగుతున్న హాజరుశాతం - తెలంగాణ వార్తలు

కరోనా అనంతరం ఇటీవలె ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. మహమ్మారి భయంతో మొదటి రోజు విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. కాగా మూడో రోజు నాటికి హాజరుశాతం క్రమంగా పెరుగుతోంది.

Students Attendance in Schools, schools reopen in telangana
పాఠశాలల్లో క్రమంగా పెరుగుతున్న హాజరుశాతం, తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం
author img

By

Published : Sep 3, 2021, 7:36 PM IST

రాష్ట్రంలో పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులకు విద్యార్థుల హాజరు క్రమంగా పెరుగుతోంది. బడులు ప్రారంభమైన మూడో రోజైన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 30.28శాతం విద్యార్థులు హాజరయ్యారు. సర్కారు బడుల్లో హాజరు శాతం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 42.76శాతం విద్యార్థులు హాజరు కాగా... ఎయిడెడ్ పాఠశాలల్లో 16.01 శాతం, ప్రైవేట్ పాఠశాలల్లో 22.78శాతం హాజరు నమోదైంది. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 53.08శాతం హాజరు నమోదు కాగా... అతి తక్కువగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 17.78శాతం నమోదైంది. సోమవారం నాటికి మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

కొవిడ్ రూల్స్ మస్ట్

కరోనా నేపథ్యంలో మూసేసిన పాఠశాలలు, కళాశాలలు ఈనెల 1 నుంచి పునఃప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా... ఈ నేపథ్యంలో అధికారులు పాఠశాలలను శుభ్రం చేసి భౌతిక తరగతులకు సిద్ధం చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నారు. స్వల్ప సంఖ్యలో విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నారు. మాస్కులు ధరించి తరగతులకు వస్తున్నారు. పాఠశాలల్లో అధికారులు, యాజమాన్యాలు శానిటైజర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించి పాఠశాల్లోనికి అనుమతిస్తున్నారు.

పిల్లల సందడి

బడిగంటలు మోగిన(Schools Reopened) పాఠశాలల్లో విద్యార్థుల సందడి మొదలైంది. దాదాపు 16 నెలల అనంతరం పునఃప్రారంభమైన పాఠశాలలకు తొలిరోజు 21.77శాతం విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ బడుల్లో 27.45, ప్రైవేట్ బడుల్లో 18.35 శాతం హాజరు నమోదయింది. జూనియర్‌ కళాశాలల్లో 15 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఉపాధ్యాయులు పిల్లలందరిని మాస్క్ తప్పనిసరిగా ధరించేలా చూస్తున్నారు. హాజరు సంఖ్య తక్కువే కావడంతో.. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. కాగా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మూడో రోజు 30.28 హాజరుశాతం నమోదైంది. సోమవారం నాటికి మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: Corona Cases in Schools: పాఠశాలలపై కరోనా పంజా.. రెండు చోట్ల ఐదుగురికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.