శాసనసభ సమావేశాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చేసేందుకే విద్యార్థి సంఘాలను అడ్డుకున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఏబీవీపీ, పీడీఎస్యూ కార్యకర్తలు అసెంబ్లీ గేటులోపటికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారని సీపీ పేర్కొన్నారు.
అసెంబ్లీ పరిసరాల్లో గుమిగూడకుండా నిషేధం విధిస్తూ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశామని అంజనీ కుమార్ తెలిపారు. శాసనసభ సమావేశాలను ఆటంకంపరచాలని ఎవరూ చూడొద్దని కోరారు. అసెంబ్లీ ఎదుట గుమిగూడే ప్రయత్నం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.