ఇంటర్ విద్యార్థుల బలవన్మరణానికి కారణమైన విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని భర్తరఫ్ చేయాలని పలు విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి పీడీఎస్‌యూ, డీవైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గ్లోబరీనా సంస్థతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థి, యువజన సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చూడండి : ప్రగతి భవన్ ముట్టడికి బీజేవైఎం శ్రేణుల యత్నం