Student Effected by Corona: హైదరాబాద్లోని ప్రైవేటు స్కూల్‌లో విద్యార్థికి కరోనా సోకింది. గుండ్లపోచంపల్లి డీఆర్ఎస్ స్కూల్‌లో ఓ విద్యార్థికి కొవిడ్ సోకింది. దీంతో విద్యార్థి స్నేహితులు 14 మందిని హోంఐసోలేషన్‌కు తరలించారు. పాఠశాలను డిప్యూటీ డీఎంహెచ్వో ఆనంద్.. వైద్య సిబ్బందితో కలిసి పరిశీలించారు. స్కూలు మొత్తాన్ని శానిటైజేషన్ చేయించారు.
ఇటీవలే విద్యార్థి ఓ ఫంక్షన్కు హాజరుకావడంతో కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. పాఠశాలలో మొత్తం 625 మంది విద్యార్థులు 100 మంది సిబ్బంది ఉన్నారు. విద్యార్థికి కరోనా సోకడంతో డీఆర్‌ఎస్ పాఠశాలకు యాజమాన్యం సెలవులు ప్రకటించింది. పిల్లలందరికి ఇంటి నుంచే ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: Omicron cases in telangana: రాష్ట్రంలో తొలిసారిగా 2 ఒమిక్రాన్ కేసులు నమోదు