గవర్నర్ నరసింహన్తో హైదరాబాద్లో భేటీ అయ్యారు... ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు జగన్. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సందర్భంగా తలెత్తిన పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వం చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని విమర్శించారు. ఏపీ స్పీకర్ కోడెల తన చొక్కా తానే చింపుకొని రాద్ధాంతం చేశారని అన్నారు. శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని పేర్కొన్నారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల బాధ్యతలను కేంద్రానికి అప్పగించాలని గవర్నర్ను కోరారు. కేంద్ర బలగాలను మరింతగా ఏపీకి పంపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి: ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రమేనా..?