ETV Bharat / state

సందిగ్ధంలో టీఎస్​ఆర్టీసీ... వజ్ర బస్సులను విక్రయించాలా? వద్దా? - ఇంటర్ సిటీ బస్సులు

ఇంటర్ సిటీ సర్వీసులు కోసం టీఎస్​ఆర్టీసీ వజ్ర మినీ ఏసీ బస్సులను కొనుగోలు చేసింది. కానీ వాటికి ప్రజల నుంచి ఆదరణ దక్కకపోవడంతో... వాటిని ఏం చేయాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వాటిని విక్రయించాలన్న ఆలోచనా ముందుకు సాగకపోవడంతో ఆ బస్సుల భవితవ్యం ఏంటన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది.

struggle-of-vajra-mini-ac-buses
వజ్రం డిపో భూషణం!
author img

By

Published : Mar 22, 2021, 8:55 AM IST

ఈ చిత్రంలో కనిపిస్తున్న బస్సులు గుర్తున్నాయా? అవేనండి వజ్ర మినీ ఏసీ బస్సులు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను కాలనీల నుంచి బస్టాండులకు చేరవేసేందుకు వీటిని టీఎస్‌ఆర్టీసీ కొనుగోలు చేసింది. కొన్ని రోజుల పాటు వాటిని ఇంటర్‌ సిటీ సర్వీసులుగా హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-నిజామాబాద్‌ తదితర ప్రాంతాలకు నడిపారు. శ్రీశైలం, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాలకూ నడిపే ప్రయత్నాలు చేశారు. వీటికి ప్రజల నుంచి ఆదరణ దక్కకపోవడంతో 60 నుంచి 70 బస్సులు మూడేళ్లుగా డిపోలకే పరిమితమై ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పడుతున్నాయి. అప్పటి నుంచి వాటిని ఏమి చేయాలన్న అంశంపై అధికారులు ఒక నిర్ణయానికి రాలేకపోయారు.

హైదరాబాద్‌లోని వివిధ కాలనీల నుంచి మెట్రో స్టేషన్లకు(లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ) బస్సులు నడపాలని యోచించినప్పటికీ కార్యరూపంలోకి రాలేదు. ఒకదశలో సీట్లను తొలగించి కార్గో సేవల కోసం వినియోగించుకోవాలని అనుకున్నా అదీ కుదరలేదు. తాజాగా వైద్యారోగ్య శాఖ అవసరాల కోసం వినియోగించేందుకు బస్సుల్లో మార్పులు చేర్పులు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా పెద్దగా స్పందన లేదన్నది అధికారుల సమాచారంగా ఉంది. వాటిని విక్రయించాలన్న ఆలోచనా ముందుకు సాగకపోవడంతో ఆ బస్సుల భవితవ్యం ఏమిటన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. మరో పక్క ఏటికేడు తరుగుదలతో వాటి విలువ పడిపోతోంది.

ఇదీ చూడండి: సైక్లింగ్‌లో సత్తా చాటుతున్న గణేశ్... అదే బాటలో సోదరీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.