రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. తెలుగు ప్రజల కష్టాలను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని స్పష్టం చేశారు. తెదేపా పేద ప్రజల గొంతుకని.. సామాన్య ప్రజలకు అండదండలు అందించే పార్టీ అని కొనియాడారు. పేద ప్రజలకు వైద్యం అందుబాటులో లేదని.. ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యా, వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విభజన చట్టంలోని హామీలను తక్షణమే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : సోనియాగాంధీ నియామకాన్ని స్వాగతిస్తున్నాం: ఉత్తమ్