ETV Bharat / state

తెగబడుతున్న కుక్కలు... వణికిపోతున్న ప్రజలు - హైదరాబాద్​లో తెగబడుతున్న కుక్కలు

భాగ్యనగరంలో ఏ గల్లీలో చూసినా గుంపులుగుంపులుగా ఉంటాయి. సంచులు పట్టుకుని వస్తుంటే చాలు పరుగెత్తిస్తాయి. బైకులపై వచ్చే వాళ్లకూ భయం పుట్టిస్తాయి. ఇక చిన్నపిల్లలు ఒంటరిగా కనిపిస్తే తెగబడిపోతాయి. రాత్రి వేళ్లల్లోనైతే... పట్టపగ్గాలే ఉండవు. ఇందంతా ఏవో రౌడీ గ్యాంగ్​ల గురించి కాదండోయ్​... గల్లీల్లో దర్జాగా గర్జిస్తున్న వీధికుక్కల దౌర్జన్యం ఇది.

dogs
dogs
author img

By

Published : Jul 22, 2020, 1:39 PM IST

హైదరాబాద్ ​నగరవాసులను గ్రామసింహాలు వణికిస్తున్నాయి. వీధుల్లో నడవాలంటే ఎప్పుడు, ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక ప్రజలు వణికిపోతున్నారు. గల్లీల్లో గుంపులుగా స్వైరవిహారం చేస్తూ... పాదాచారులుపైకి తెగబడుతున్నాయి. వాహనదారుల వెంట పరుగులు తీస్తూ... గుబులు రేపుతున్నాయి. పట్టపగలే కుక్కలు దాడులు చేయటం వల్ల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక రాత్రివేళల్లో అయితే చెప్పనక్కర్లేదు. వీధుల్లోకి ఒంటరిగా ఏం కర్మ... గంపుగా రావాలన్నా గజగజా వణికిపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దర్జాగా దాడులు...

గతంలో కార్పొరేషన్‌ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకుని చంపేసేవారు. జంతు సంరక్షణ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయటం వల్ల కుక్కలను వధించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి గల్లీల్లో కనిపించే వ్యక్తుల మీద దర్జాగా దాడులు చేస్తున్నాయి.

చిన్నపిల్లలపై పడి రక్కేస్తున్నాయి...

చిన్న పిల్లలపై కుక్కులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. కుక్కల దాడుల్లో ఇప్పటి వరకు చాలా మందికిపైగా చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. గాయాల తీవ్రత కూడా ఎక్కువగా ఉండటం వల్ల స్థానికులు పిల్లల్ని భయటకు పంపించాలంటే భయపడుతున్నారు.

దూర ప్రాంతాల్లో వదిలేస్తే...

వాతావరణంలో మార్పుల వల్ల కుక్కల లాంటి క్షీరదాల ప్రవర్తన భయానకంగా మారుతోందని వైద్యులు వివరిస్తున్నారు. ఆకలితో ఉన్నప్పుడు, పునరుత్పత్తి ప్రక్రియ సమయాల్లో చాలా ఘర్షణాత్మకంగా ఉంటూ దాడులకు తెగబడతాయని హెచ్చరిస్తున్నారు.

వీధి కుక్కలకు పునరుత్పతి నియంత్రించటమే కాకుండా వ్యాక్సిన్లు వేసి.. వాటిని దూర ప్రాంతాల్లో వదిలేస్తే దాడులను అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.