హోలీని దృష్టిలో పెట్టుకుని ఈవెంట్లను నిర్వహించేందుకు ప్రణాళికలు రచించిన పలు సంస్థలకు నిరాశే ఎదురైంది. ఈసారైనా వేడుకలు జరుగుతాయనుకున్న తరుణంలో ఆంక్షలు విధించడంతో ఈవెంట్లను రద్దు చేసుకున్నాయి. లక్షలాది రూపాయలు నష్టపోయామని సంస్థల మేనేజర్లు చెబుతున్నారు.
రెండో‘సారీ’...
‘రెయిన్ డ్యాన్స్, బెలూన్ ఫైట్స్, వాటర్ గన్, కలర్ స్ప్లాష్, డీజే’ సదుపాయాలతో ప్రముఖ హోటళ్లలో వేడుకలకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ముందస్తు బుకింగ్‌లు అయ్యాయి. వేడుకలకు అనుమతులివ్వడం లేదని పోలీసులు ప్రకటించగానే వారందరికీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ఈవెంట్ సంస్థలు ప్రకటించాయి.ఈ ఒక్కరోజే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదించేవారమని ప్రముఖ డీజే పృథ్వీసాయి తెలిపారు. ఇక బేగంబజార్‌లో రంగులు కొనుగోలు చేసేవారు అంతంత మాత్రంగానే కనిపించారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న రంగుల్లో 20 శాతం కూడా విక్రయాలు జరగలేదని వాపోయారు.
ఇదీ చూడండి: ఇహానికి... పరానికి రంగుల పున్నమి!