ETV Bharat / state

Stolen Mobile Tracking Portal Telangana : మీ ఫోన్ పోయిందా.. టెన్షన్ పడకండి.. ఇలా చేస్తే ఇట్టే దొరుకుతుంది - How To Find Lost Your Mobile

Stolen Mobile Tracking Portal Telangana : మీ మొబైల్ ఫోన్ చోరీకి గురైందా?.. లేకపోతే ఎక్కడైనా పోయిందా? అయితే వెంటనే సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్​లో నమోదు చేసుకోండి. పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు గుర్తించేందుకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సీఈఐఆర్ పోర్టల్ మంచి ఫలితాలనిస్తోంది. దేశవ్యాప్తంగా.. ఈ పోర్టల్ ద్వారా పోలీసులు సులభంగా మొబైల్ ఫోన్లను గుర్తించ గలుగుతున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.

CEIR Mobile Tracker
CEIR Stolen Mobile Tracking Portal
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 31, 2023, 1:03 PM IST

Stolen Mobile Tracking Portal Telangana : మీ ఫోన్ పోయిందా.. టెన్షన్ పడకండి.. ఇలా చేస్తే ఇట్టే దొరుకుతుంది

Stolen Mobile Tracking Portal Telangana : మొబైల్ ఫోన్ అనేది నిత్యజీవితంలో తప్పనిసరి వినియోగ వస్తువైపోయింది. ఒక్కొక్కరు అవసరాన్ని బట్టి రెండు సెల్‌ఫోన్లు సైతం వినియోగిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. దొంగలు చరవాణీని కొట్టేస్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. సీఈఐఆర్ పోర్టల్ రిజిష్టర్‌ చేసుకుంటే పొగొట్టుకున్న చరవాణిని టెలికాం శాఖ సాయంతో గుర్తించే అవకాశం ఉంది. దీనికి కావాల్సిందల్లా మీ గుర్తింపు వివరాలు, చరవాణీ కొనుగోలు చేసిన వివరాలు కలిపి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే వారే ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేస్తారు.

How To Find Lost Your Mobile in Telugu : ఈ ఏడాది ఏప్రిల్ 19న దీన్ని తెలంగాణలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. నెల రోజుల పాటు పరిశీలించిన తర్వాత దేశవ్యాప్తంగా మే 17వ తేదీన అందుబాటులోకి తీసుకొచ్చారు. సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా దీన్ని రూపొందించారు. చరవాణి పోయిన వ్యక్తి మొదట తన సిమ్ కార్డును బ్లాక్ చేయించి.. తిరిగి అదే నంబర్‌తో కొత్త సిమ్‌ కార్డును పొందాలి. చరవాణికి సంబంధించిన ఐఎమ్ఈఐ నెంబర్‌ను నమోదు చేయాలి. మొబైల్‌ను బ్లాక్ చేసే సందర్భంలో సిమ్ కార్డుకు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి.

How To Find Lost Mobile : మీ మొబైల్​ ఫోన్​ పోయిందా.. టెన్షన్​ ఎందుకు.. 'సంచార్ సాథీ' తోడు ఉందిగా!

కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే ఇన్‌వాయిస్ కాపీని వెబ్‌ సైట్‌లో నమోదు చేయాలి. అంతేకాకుండా చిరునామాకు సంబంధించిన గుర్తింపు కార్డుతో పాటు.. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందనే వివరాలు పేర్కొనాలి. అంతగా అవగాహన లేకపోతే పోలీసులే పీఎస్​లో నమోదు చేస్తారు. ఒకసారి నమోదు చేస్తే తిరిగి దాన్ని మళ్లీ నమోదు చేసే అవకాశం ఉండదు.చరవాణి ఐఎమ్ఈఐ నెంబర్లను దేశంలోని అన్ని టెలికాం ఆపరేటర్లకు పంపిస్తారు. ఇక సెల్‌ఫోన్‌ను దేశంలో వినియోగించే అవకాశమే ఉండదు.

CEIR Mobile Tracker Telangana 2023 : ఆ చరవాణిలో ఎవరైనా సిమ్ వేస్తే వెంటనే టెలికాం ఆపరేటర్ల ద్వారా సీఈఐఆర్ పోర్టల్‌తో పాటు..సెల్‌ఫోన్ యజమానికి సందేశం వెళ్తుంది. సెల్‌ఫోన్‌ను ఉపయోగించే వ్యక్తి సిమ్‌కార్డు నెంబర్‌తో పాటు ఎక్కడ వినియోగిస్తున్నారనే వివరాలు పోర్టల్ ద్వారా పోలీసులకు తెలిసిపోతుంది. జాతీయస్థాయిలో సెల్‌ఫోన్‌ రికవరీలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది. ఈ పోర్టల్‌ ద్వారా ఇప్పటి వరకూ 10వేలకు పైగా సెల్ ఫోన్లను గుర్తించి.. యజమానులకు అప్పజెప్పారు.

రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. సీఈఐఆర్ వెబ్‌సైట్‌ను టీఎస్ పోలీస్ సిటిజన్ పోర్టల్‌కు సైతం అనుసంధానించారు. చోరీకి గురైన సెల్‌ఫోన్ గురించి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే ఫిర్యాదుదారుడికి సందేశం వచ్చేలా సీఈఐఆర్ వెబ్‌సైట్ ను తీర్చిదిద్దారు. డీజీపీ అంజనీ కుమార్ ఈ పోర్టల్ ను పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారులను అభినందించారు.

మొబైల్​ ఫోన్​ పోయిందా? ఆన్​లైన్​లో సింపుల్​ రిక్వెస్ట్​తో బ్లాక్! సిమ్ మార్చినా నో ఛాన్స్!!

How to Turn off Business Ads in Google Maps : గూగుల్ మ్యాప్స్​లో యాడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా?.. ఇలా ఆపేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.